
కీర్తిసురేష్.. ఈ భామ గురించి.. ఆమె ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . నేను శైలజ అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే నటనతో ఆకట్టుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం కీర్తిసురేష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తోన్న కీర్తిసురేష్. ఆయా సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటుంది. తెలుగులో ఈ అమ్మడికి మంచి క్రేజ్ ఉంది. కేరీర్ బిగినింగ్ నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉన్న కీర్తి.. ఈ మధ్య అందాలతో రెచ్చిపోతుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారిపాట సినిమాలో కీర్తిసురేష్ గ్లామర్ తో ఆకట్టుకుంది.
ఆ సినిమాలో అందాలు ఆరబోస్తూ కవ్వించింది కీర్తిసురేష్. అలాగే సోషల్ మీడియాలోనూ పరువాల వలలు విసురుతోంది ఈ చిన్నది. రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాతో మంచి హిట్ అందుకుంది. దాసర సినిమాలో కీర్తిసురేష్ నటన కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చాలా సహజంగా నటించి ఆకట్టుకుంది.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో చేస్తోంది ఈ చిన్నది. ఈ సినిమాలో మెగాస్టార్ సిస్టర్ గా కనిపించనుంది కీర్తి. ఇదిలా ఉంటే కీర్తిసురేష్ సినిమాల ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. కీర్తి సురేష్ ప్రస్తుతం 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. పలు యాడ్ లాల్లోనూ కనిపిస్తోంది ఈ భామ . మొత్తంగా కీర్తిసురేష్ ఏడాది సంపాదన 6 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని టాక్ వినిపిస్తోంది.