ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ఐశ్వర్య, విక్రమ్, త్రిష, కార్తి నటనపై ప్రశంసలు అందుతున్నాయి. కానీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే ఓపెనింగ్ చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ నెక్ట్స్ డే ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తమిళ చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. చియాన్ విక్రమ్, ఐశ్వర్య రాయ్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ్ల ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్ హిట్ అందుకుంది. ఇక ఇటీవలే మూవీ పార్ట్ 2 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా.. ఐశ్వర్య, విక్రమ్, త్రిష, కార్తి నటనపై ప్రశంసలు అందుతున్నాయి. కానీ ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే ఓపెనింగ్ చాలా తక్కువ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ నెక్ట్స్ డే ఒక్కసారిగా టర్న్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద తమిళ చిత్రాలలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

విడుదలైన రెండు రోజుల్లోనే ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది పొన్నియన్ సెల్వన్ సినిమా. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ట్విట్టర్ వేదికగా అందించింది. ఫస్ట్ పార్ట్ సుమారు రూ. 600 కోట్లకు పైగా రాబట్టింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ సైతం రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి



ఈ సినిమా కేవలం భారతదేశంలోనే కాకుండా.. అమెరికా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక, సింగపూర్, మలేషియా.. యూకే, దేశాల్లోనూ భారీగానే వసూళ్లు రాబడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాకు తమిళనాడులో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed