ఆస్ట్రేలియా అడవుల అడ్వెంచర్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందట. అయితే ఫ్యాన్స్ అంతా ఇప్పుడు జక్కన్న.. మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా రాజమౌళి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.

Rajamouli, Anand Mahindra

ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. వరల్డ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డ్ అందుకుని హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీతో తెలుగు చిత్రపరిశ్రమపై హాలీవుడ్ మేకర్స్ సైతం ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం జక్కన్న తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన తదుపరి చిత్రం తెరకెక్కించనున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశారు జక్కన్న. దీంతో వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఆస్ట్రేలియా అడవుల అడ్వెంచర్ నేపథ్యంలో ఈ మూవీ ఉండబోతుందట. అయితే ఫ్యాన్స్ అంతా ఇప్పుడు జక్కన్న.. మహేష్ బాబు ప్రాజెక్ట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా రాజమౌళి గురించి ఆసక్తికర ట్వీట్ చేశారు.

తన ట్విట్టర్ లో ఓ ఫోటోను షేర్ చేస్తూ.. “మన సంస్కృతి మనకు గుర్తుకు తెచ్చే వాటిలో ఇలాంటివి ఉదాహరణలుగా ఉంటాయి. మన నాగరికతను తెలియజేసేలా అప్పటి కాలానికి సంబంధించినట్లు రాజమౌళి ఓ సినిమాను చేయాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మన పూర్వీకుల నాగరికత అవగతమవుతుంది.” అని తెలిపారు. అయితే ఆయన చేసిన ట్వీట్ కు జక్కన్న స్పందించారు.”అలాగే సర్.. నేను ధోలా వీర ప్రాంతంలో మగధీర చిత్రాన్ని షూట్ చేస్తున్నప్పుడు ఒక చెట్టు గమనించాను. అది శిలాజంగా మారిపోయింది. సింధులోయ సంస్కృతి నాగరికత గురించి ఆ చెట్టు కథ చెబుతున్నట్లు సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చింది.

ఇవి కూడా చదవండి



కొన్ని సంవత్సరాల తర్వాత పాకిస్థాన్ కు సందర్శించాను. మెహంజదారో ప్రాంతాన్ని చూడాలని గట్టిగా ప్రయత్నించాను. బాధకరమైన విషయమేంటంటే.. పాకిస్థాన్ వాళ్లు పర్మిషన్ ఇవ్వలేదు” అంటూ రియాక్ట్ అయ్యారు రాజమౌళి రియాక్ట్ ఇచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed