తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో ఈ కుర్రాడే. తెలుగులోనూ అత్యధికంగా ఫ్యాన్స్ ఉన్న ఈ తమిళ్ స్టార్.. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి.

పైన ఫోటోలో సూపర్ స్టార్ రజినీకాంత్ పక్కన ఉన్న ఈ చిన్నోడు ఇప్పుడు సౌత్ ఇండియాలోనే స్టార్ హీరో. అతనికి పాన్ ఇండియా లెవల్లో భారీగా ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా ఈహీరోకు ఉన్న లేడీ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ హీరో సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. తమిళ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న హీరో ఈ కుర్రాడే. తెలుగులోనూ అత్యధికంగా ఫ్యాన్స్ ఉన్న ఈ తమిళ్ స్టార్.. ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఎవరో గుర్తుపట్టండి. ఆ కుర్రాడు ఎవరో కాదు.. స్టార్ హీరో విజయ్ దళపతి.

తమిళంలో ఫుల్ పాపులారిటీ ఉన్న హీరో విజయ్ దళపతికి తెలుగులోనూ అభిమానులున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.ఏ చంద్రశేఖర్, క్లాసికల్ సింగర్ శోభ దంపతుల కుమారుడే విజయ్. సినిమాలపై ఇష్టంతో చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు విజయ్. కానీ కెరీర్ స్టార్టింగ్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. ఆ తర్వార ఫిట్ నెస్ పెంచుకుని హీరోగా తనను తాను నిరూపించుకున్నాడు.

విజయ్ సినిమా వస్తుందంటే ఇప్పుడు తమిళనాడులో పండగ వాతావరణం ఉంటుంది. కనీసం రూ. 200 కోట్లు వసూళ్లు వచ్చే రేంజ్ కు ఎదిగారు. విజయ్ దళపతికి దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ ఏడాది వారసుడు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు విజయ్. ప్రస్తుతం ఆయన డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో చిత్రం చేస్తున్నారు. ఇందులో త్రిష కథానాయిగా నటిస్తోంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed