ప్రస్తుతం ఈ మూవీ మిక్డ్స్ టాక్ అందుకుని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా నటి పాలక్ తివారీ సల్మాన్ ఖాన్ సెట్‏లో విధానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ సెట్‏లో మహిళలంతా నిండుగా దుస్తులు ధరించాలని సల్మాన్ ఖాన్ రూల్ ఉంటుందని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ కామెంట్స్ పై వివరణ ఇచ్చాడు సల్మాన్.

ఇటీవల కిసీ కి భాయ్ కిసీ కి జాన్ సినిమాతో థియేటర్లలో సందడి చేశారు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించగా.. వెంకటేష్, భూమిక కీలకపాత్రలలో నటించారు. ట్రైలర్, సాంగ్స్‏తో భారీ అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ విడుదలైన తర్వాత అంతగా ఆకట్టుకోలేదు. ప్రస్తుతం ఈ మూవీ మిక్డ్స్ టాక్ అందుకుని థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా నటి పాలక్ తివారీ సల్మాన్ ఖాన్ సెట్‏లో విధానం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్ సెట్‏లో మహిళలంతా నిండుగా దుస్తులు ధరించాలని సల్మాన్ ఖాన్ రూల్ ఉంటుందని చెప్పుకొచ్చింది. తాజాగా ఈ కామెంట్స్ పై వివరణ ఇచ్చాడు సల్మాన్.

ఇటీవల ఆప్ కి అదాలత్ షోలో పాల్గొన్న సల్మాన్.. తన సినీ ప్రయాణం గురించి కాకుండా.. వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.ఇందులో భాగంగా.. సెట్ లో మహిళల దుస్తులకు సంబంధించిన నియమం ఉంటుందట అని హోస్ట్ ప్రశ్నించగా.. సల్మాన్ స్పందించాడు. “నాకు తెలిసినంతవరకు మహిళల శరీరాలు చాలా విలువైనవి. అందుకే తమ శరీరాన్ని ఎక్కువగా కప్పుకుంటే అంత మంచిది. కేవలం మహిళలే కాదు..పురుషులు కూడా నిండుగా దుస్తులు ధరిస్తే మంచిది” అని చెప్పుకొచ్చాడు సల్మాన్.

దీనిపై హోస్ట్ రియాక్ట్ అవుతూ.. అమ్మాయిలు సరే.. ఒ ఓ జానే జానా పాటలో మీరు షర్ట్ లేకుండా కనిపించారు కదా అని అడగ్గా.. ఆ పాటలో నేను స్విమ్మింగ్ ట్రంక్స్ తో కనిపించాలని బదులిచ్చాడు సల్మాన్. అప్పటి కాలం వేరు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మహిళలు పూర్తిగా దుస్తులు ధరించాలి. అబ్బాయిలు, అమ్మాయిలను చూడటానికి ఇదే కారణం అవుతుందని అన్నారు. మన ఇంట్లో అక్కలు.. చెల్లెలు, భార్యలు, అమ్మలు అలా కనిపించడాన్ని ఇష్టపడరని అన్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed