సంయుక్త మేనన్‌ తన గొప్ప మనసును చాటుకుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ రియాల్టీ షోకు వెళ్లిన ఆమె తాను గెల్చుకున్న స్కూటీని ఓ కాలేజీ అమ్మాయికి బహుమతిగా ఇచ్చింది. అలాగే మరొక అమ్మాయికి తానే స్కూటీ కొనిస్తానంటూ ముందుకొచ్చింది.

సాయి ధరమ్‌ తేజ్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన విరూపాక్ష బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 70 కోట్లు కలెక్ట్‌ చేసిన ఈ మూవీ వంద కోట్ల వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఇదిలా ఉంటే సంయుక్త మేనన్‌ తన గొప్ప మనసును చాటుకుంది. మూవీ ప్రమోషన్లలో భాగంగా ఓ టీవీ రియాల్టీ షోకు వెళ్లిన ఆమె తాను గెల్చుకున్న స్కూటీని ఓ కాలేజీ అమ్మాయికి బహుమతిగా ఇచ్చింది. అలాగే మరొక అమ్మాయికి తానే స్కూటీ కొనిస్తానంటూ ముందుకొచ్చింది. బస్సుల్లో ట్రావెల్‌ చేస్తూ ఇబ్బందులు పడుతున్న ఈ ఇద్దరు అమ్మాయిలు సంయుక్త సాయంతో పట్టరాని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు సంయుక్త ఉదారతను మెచ్చుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. విరూపాక్షను మరింతగా జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఇటీవల ఓ రియాలిటీ షోలో సందడి చేసింది మూవీ టీమ్‌. సంయుక్తతో పాటు హీరో సాయి ధరమ్‌ తేజ్‌, సోనియా సింగ్‌, రవికృష్ణ ఈ షోలో సందడి చేశారు. ప్రోగ్రామ్‌లో గెల్చుకున్న స్కూటీని అక్కడకు వచ్చిన కాలేజీ అమ్మాయిల్లో ఎవరో ఒకరికి ఇస్తానిని సాయి తేజ్‌ ప్రకటించాడు. అయితే షోలో సంయుక్త స్కూటీ గెల్చుకుంది. అయితే, ఆ స్కూటీ తనకు వద్దని సాయి ధరమ్‌ తేజ్‌ ప్రకారం ఓ అమ్మాయికి దానిని బహుమతిగా ఇస్తానని సంయుక్త తెలిపింది. ఈక్రమంలోనే సింగిల్‌ పేరెంట్‌ ఉన్న ఇద్దరు అమ్మాయిలను ఎంచుకున్న అందులో ఒకరికి తాను గెల్చుకున్న సూటీని గిఫ్ట్‌గా ఇచ్చింది. అలాగే మరొక అమ్మాయికి తానే కొత్త స్కూటీ కొనిస్తానిని మాటిచ్చింది సంయుక్త.

సంయుక్త మాటలతో ఉప్పొంగిపోయిన ఆ ఇద్దరూ అమ్మాయిలు ఆమెను ప్రేమతో హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు సంయుక్త మంచి మనసును కొనియాడుతున్నారు. ‘బ్యూటీ విత్‌ గోల్డెన్‌ హార్ట్‌’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇటీవల విరూపాక్ష దర్శకుడు దండు కార్తీక్‌కు సంయుక్త ఐ ఫోన కొనిచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ థియేటర్‌కు వెళ్లిన ఆయన ఫోన్‌ పోగొట్టుకున్నారని తెలిసి, ఖరీదైన ఐఫోన్‌ కొనుగోలు చేసి మరీ గిఫ్ట్‌గా ఇచ్చిందామె.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *