Cool Water Side Effects: రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలతో పాటు పెరుగుతున్న ఎండలతో, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఈ ఎండల ధాటి నుంచి కాస్త చల్లదనం కోసం ఫ్రిడ్జ్ వాటర్, లేదా కూల్ వాటర్..

Cool Water Side Effects: రోజు రోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా బయటికి రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలతో పాటు పెరుగుతున్న ఎండలతో, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఈ ఎండల ధాటి నుంచి కాస్త చల్లదనం కోసం ఫ్రిడ్జ్ వాటర్, లేదా కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ తాగుతుంటారు. వీటితో కొంత సేపు ఉపశమనం పొందుతారు. అయితే వేసవి కాలంలో కూల్ వాటర్, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. చల్లని నీటితో పెను ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు కూడా. ఈ నేపథ్యంలో వేసవి కాలంలో కూల్ చల్లని నీళ్లు, చల్లని పానీయాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియపై ప్రభావం: వేసవి ఎండలలో కూల్ వాటర్ తాగడం వల్ల ప్రధానంగా జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుందని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఆహారం తినే ముందు చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుందని, ఫలితంగా అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు.

శ్వేద రంధ్రాలు మూసుకుపోవడం: వేసవి కాలంలో చాలా మంది బయటి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే కూల్ వాటర్‌తో ముఖం, శరీరం కడుక్కుంటారు. అయితే ఇలా చేయడం మరింత ప్రమాదకరమంట. చన్నీటితో శరీరం చర్మాన్ని కడిగితే.. దానిపై ఉండే శ్వేద రంధ్రాలు మూసుకుపోతాయని వివరిస్తున్నారు నిపుణులు. ఫలితంగా శరీరంలోని వ్యర్థాలు బయటకు రాకుండా.. మొటిమలు, నల్లటి మచ్చలకు కారణం అవుతుంది. కాబట్టి గోరు వెచ్చని నీరు గానీ, సాధారణ నీటితో గానీ చర్మాన్ని కడుక్కోవాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



హృదయ స్పందన రేటు: వేసవిలో కూల్ వాటర్ తాగడం వల్ల హార్ట్ బీటింగ్ రేట్ తగ్గిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది శరీరం అసంకల్పిత విధులను నియంత్రించే నాడిని ప్రేరేపిస్తుందని, ఫలితంగా నాడీ వ్యవస్థపై పడి చురుకుదనం తగ్గుతుందంట. దీని కారణంగానే హృదయ స్పందన రేటు తగ్గిపోతుందని వారు పేర్కొంటున్నారు.

త‌ల‌నొప్పి: కూల్ వాటర్ తాగడం వల్ల వెన్నెముకలోని సెన్సిటీవ్ నరాలు ప్రభావితమై, తలనొప్పికి దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చల్లని నీటి కారణంగా ముఖం, కపాల కండరాలు జివ్వుమని లాగి.. తీవ్రమైన నొప్పి వస్తుంది.

మ‌ల‌బ‌ద్ధకం: ఆహారం తినే ముందు గానీ, తింటున్న సమయంలో గానీ, తిన్న తరువాత గానీ కూల్ వాటర్ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. జీర్ణ వ్యవస్థపై కూడా దీని ప్రభావం పడి మలబద్ధకం, అజీర్తి సమస్యలకు కారణమవుతుందని చెబుతున్నారు.

బరువు:  వేసవి ఎండలలో కూల్ వాటర్ తాగడం వల్ల బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కూల్ వాటర్ కారణంగా శరీరంలో కేలరీలు బర్న్ అయ్యే ప్రక్రియ తీవ్రంగా నెమ్మదిస్తుందని, ఫలితంగా బరువు పెరుగుతారని పేర్కొంటున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed