BRS Party: ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో వర్గపోరు భగ్గుమంటోంది. ఇప్పటికే.. పొంగులేటి వర్గం బీఆర్ఎస్‌కు తలనొప్పిగా మారింది. కొత్తగా సొంత పార్టీలోనే గ్రూపులు తయారవడం.

ఖమ్మం రాజకీయాలు హీటెక్కిపోతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలిటిక్స్‌ ప్రస్తుత్తం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార ప్రభుత్వంపై పొంగులేటి ఆరోపణలు, విమర్శలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. దాంతో.. కారు పార్టీ నేతల్లో కంగారు పుడుతోందనే ప్రచారం జరుగుతోంది. పొంగులేటి ఎపిసోడ్‌ తర్వాత చాలామంది ప్రజాప్రతినిధులు, నేతలు ఆయన వెంటే ఉంటున్నారు. కొందరు బాహాటంగానే కారు పార్టీకి కటీఫ్‌ చెప్పేశారు.

అయితే.. ఇది చాలదన్నట్లు.. ఇప్పుడు సొంత పార్టీలోనే వర్గపోరు భగ్గుమంటోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు బీఆర్ఎస్‌లో వర్గపోరు రోజురోజుకీ మరింత ముదురుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా కారు పార్టీలో మరో వర్గం తయారైంది. హరిప్రియనాయక్‌ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఇల్లందు బీఆర్ఎస్‌ నేతలు.. బహిరంగంగా విమర్శలు చేయడంతోపాటు పోరుకు సిద్ధమవుతున్నారు.

ఏకంగా.. ఆమెపై మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌ అధ్యక్షులకు ఫిర్యాదు చేశారు కొందరు నేతలు. ఫిర్యాదు చేసిన వారిలో ఇల్లందు మునిసిపల్ చైర్మన్, బయ్యారం, కామేపల్లి మండలాల pacs చైర్మన్లు, ఇతర బీఆర్ఎస్‌ పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. ఆల్‌మోస్ట్‌.. ఇల్లందు కారు పార్టీలోని మెజార్టీ నేతలు హరిప్రియనాయక్‌కు వ్యతిరేకంగా తయారయ్యారు. హరిప్రియనాయక్‌ సెంట్రిక్‌గా పాలిటిక్స్‌ నడుపుతున్నారు కారు పార్టీలోని అసమ్మతివర్గం నేతలు.

అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో హరిప్రియకు టిక్కెట్ ఇవ్వద్దని డిమాండ్ చేస్తోంది ఆమె వ్యతిరేక వర్గం. వాస్తవానికి.. ఇల్లందు బీఆర్ఎస్‌కు పొంగులేటి ఎఫెక్ట్‌ గట్టిగానే ఉంది. ఎందుకంటే.. జడ్పీ చైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యతోపాటు సీనియర్‌ నేతలు కొందరు పొంగులేటి కాంపౌండ్‌లోనే ఉన్నారు. రీసెంట్‌గా గార్ల జడ్పీటీసీ బీఆర్ఎస్‌కు రిజైన్‌ చేసిన పొంగులేటి వర్గంలో చేరారు.

ఇలా.. ఇప్పటికే నానా తంటాలు పడుతున్న ఇల్లందు బీఆర్ఎస్‌ నేతలకు.. ఇప్పుడు సొంత పార్టీలోనే కొత్త కుంపట్లు తయారు కావడంతో పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌ కీలక నేతలు.. ఇల్లందు కారు పార్టీలోని ఫైట్‌ను ఎలా సాల్వ్‌ చేస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *