ఇందులో విక్రమ్ చియాన్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలోల నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సందడి చేసింది. ఇందులో త్రిష హైలెట్ అయ్యింది. గతంలో కంటే మరింత అందంగా.. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‏తో సక్సెస్ ఫుల్‏గా రన్ అవుతున్న సినిమా పొన్నియన్ సెల్వన్ 2. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాను రెండు పార్టులుగా ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చారు. గతేడాది ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకోగా.. ఇప్పుడు సెకండ్ పార్ట్ రిలీజ్ అయ్యింది. ఇందులో విక్రమ్ చియాన్, త్రిష, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రలోల నటించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్రయూనిట్ దేశంలోని పలు ప్రధాన నగరాల్లో సందడి చేసింది. ఇందులో త్రిష హైలెట్ అయ్యింది. గతంలో కంటే మరింత అందంగా.. ఇప్పటికీ 20 ఏళ్ల అమ్మాయిగా కనిపిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

దాదాపు రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో అగ్రకథానాయికగా కొనసాగుతుంది త్రిష. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన వర్షం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగుతోపాటు.. తమిళంలోనూ స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన త్రిష… ఆ తర్వాత కాస్త స్లో అయ్యింది. కుర్రహీరోయిన్స్ తాకిడికి ఈ అమ్మడు సైడ్ అయిపోయింది. అదే సమయంలో ఆమె నటించిన చిత్రాలు అంతగా క్లిక్ కాకపోవడంతో త్రిషకు అవకాశాలు తగ్గిపోయాయి. తాజాగా పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష బౌన్స్ బ్యాక్ అనే చెప్పుకొవచ్చు. ఈ సినిమాలో త్రిష యువరాణి కుందవై పాత్రలో మంత్రముగ్దులను చేసింది.

ఇక ఈ సినిమా ప్రమోషన్లలో త్రిష లుక్స్ గురించి చెప్పక్కర్లేదు. పొన్నియన్ సెల్వన్ కవరేజ్ లో అంతా త్రిష మీదే మీడియా ఫోకస్ చేసింది. ప్రతి ఈవెంట్లో మరింత అందంగా కనిపిస్తూ తన లుక్స్ తో కట్టిపడేసింది. ఇంకేముంది.. త్రిష కోసం మరిన్ని ఆఫర్స్ క్యూ కడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటిస్తోన్న లియో చిత్రంలో నటిస్తుంది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ఈ హిట్ జోడి రిపీట్ కాబోతుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇటు తెలుగులోనూ ఈ అమ్మడుకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed