సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌గా నటించిన విరూపాక్ష మూవీ బాక్సాఫీస్‌ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఏప్రిల్‌ 21న థియేటర్లలో విడుదలైన ఈ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీనికి తోడు ఈ వారం విడుదలైన అఖిల్‌ అక్కినేని ఏజెంట్‌కు నెగెటివ్‌ రావడం విరూపాక్షకు బాగా కలిసొచ్చేలా ఉంది.

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌గా నటించిన విరూపాక్ష మూవీ బాక్సాఫీస్‌ వద్ద జోరు కొనసాగిస్తోంది. ఏప్రిల్‌ 21న థియేటర్లలో విడుదలైన ఈ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీనికి తోడు ఈ వారం విడుదలైన అఖిల్‌ అక్కినేని ఏజెంట్‌కు నెగెటివ్‌ రావడం విరూపాక్షకు బాగా కలిసొచ్చేలా ఉంది. అందుకే వీకెండ్స్‌లో వసూళ్ల వర్షం కురుస్తోంది. తాజాగా విరూపాక్ష సినిమా 8 రోజుల్లో ఏకంగా రూ.70 కోట్ల గ్రాస్‌నను కలెస్ట్‌ చేసింది. తద్వారా సాయి ధరమ్‌ తేజ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. వచ్చేవారం వరకు సినిమాలేవీ లేకపోవడంతో లాంగ్‌ రన్‌లో  సాయి ధరమ్ తేజ్ మూవీ  వంద కోట్ల క్లబ్‌లో ఈజీగా చేరవచ్చని ట్రేడ్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని చూసి పాన్‌ ఇండియా వైడ్‌గా విరూపాక్షను రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ముంబై కూడా వెళ్లొచ్చారు. త్వరలోనే ఈ సినిమా బాలీవుడ్‌లోనూ విడుదల కానుంది.

విరూపాక్ష సినిమాకు క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడు కార్తీక్‌ దండు దర్శకత్వం వహించారు. మలయాళం సెన్సేషన్‌ సంయుక్త మేనన్‌ తేజ్‌కు జోడీగా నటించింది ఈ సినిమాలో. SVCC బ్యానర్ పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. ఇక సుకుమార్‌ గ్రిప్పింగ్‌ స్ర్కీన్‌ ప్లే ప్రేక్షకులను సీట్లలో నుంచి లేవకుండా కూర్చొబెట్టింది. అలాగే కాంతారా, విక్రాంత్ రోణ ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ అందించిన బీజీఎమ్‌, స్వరాలు విరూపాక్ష విజయంలో కీలక పాత్ర పోషించాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *