ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ షో ఉందంటే చాలు జనాలు ఎగబడి వచ్చేస్తారు. అయితే తాజాగా పూణెలో జరిగిన మ్యూజిక్ కన్సెర్ట్‌లో పోలీసులు ఆయనకు షాకిచ్చారు. సమయం అయిపోయినప్పటీకీ ఇంకా మ్యూజిక్ కొనసాగడంతో పోలీసులు ఏకంగా స్టేజ్ పైకి ఎక్కేసారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ షో ఉందంటే చాలు జనాలు ఎగబడి వచ్చేస్తారు. అయితే తాజాగా పూణెలో జరిగిన మ్యూజిక్ కన్సెర్ట్‌లో పోలీసులు ఆయనకు షాకిచ్చారు. సమయం అయిపోయినప్పటీకీ ఇంకా మ్యూజిక్ కొనసాగడంతో పోలీసులు ఏకంగా స్టేజ్ పైకి ఎక్కేసారు. రెహమాన్ పాటలు పాడుతుండగానే అడ్డుకున్నారు. వెంటనే ఆపేయాలని ఆయన్ని, మ్యూజిక్ బ్యాండ్ సభ్యుల్ని కోరారు. ఇక చేసేదేం లేక రెహమన్ టీమ్ తమ మ్యూజిక్ కన్సెర్ట్‌ను ముగించాల్సి వస్తుంది.

అప్పటివరకు రెహమాన్ మ్యూజికల్ కన్సెర్ట్‌కు అనూహ్య స్పందన వచ్చింది. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. రెహమాన్ టీమ్ తమ పాటలతో యువతను ఉర్రూతలూగించారు. అయితే ఈ షో మొత్తం ముగిసిన తర్వాత రెహమాన ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. కన్సెర్ట్‌ను విజయవంతం చేసినందుకు పూణే అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed