ఎన్నో అంచనాల మధ్య అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ మరీ చెప్పుకోలేనంత దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలో అఖిల్ స్క్రిప్ట్ సెలక్షన్‌పై నెట్టింట పెద్ద ఎత్తున డిబేట్ నడుస్తుంది.

Akhil Akkineni – Anil Sunkara

ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్‌గా… అందర్నీ ఊరించి రీసెంట్‌గా రిలీజ్ అయిన అఖిల్ అక్కినేని ఏజెంట్ ఫిల్మ్.. బాక్సాఫీస్ ముందు బొక్కబోర్లా పడింది. కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. ఇది ప్యూర్లీ డైరెక్టర్ ఫెయిల్యూర్ అని.. కాదు.. కాదు.. హీరో ఫెయిల్యూర్ అనే డిబెట్ నెట్టింట నడిచేలా చేస్తోంది. ఇక ఈ కమ్రంలోనే.. ఈసినిమా రిజెల్ట్ పై చాలా ఎమోషనల్గా ట్వీట్ చేశారు ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర. ట్వీట్ చేయడమే కాదు.. ఏజెంట్ బ్లేమ్ పూర్తిగా తమదే అంటూ ఆ ట్వీట్లో కోట్ చేశారు.  ఏకే ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో.. పలు హిట్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్న అనిల్ సుంకర… తాజాగా ఏజెంట్ వైఫల్యంపై స్పందించారు. ఈ సినిమా రిజెల్ట్ పూర్తి బాధ్యత తమదే అంటూ.. హానెస్ట్ ట్వీట్ చేశారు. ఎన్నో అంచనాల మధ్య.. అఖిల్ హీరోగా… సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా తమకో అప్‌ హిల్ టాస్క్ అన్న ఈ స్టార్ ప్రొడ్యూసర్ … కానీ ఈ టాస్క్‌ లో తాము పూర్తిగా ఫెయిల్ అయ్యామని తన ట్వీట్లో రాసుకొచ్చారు. బౌండెడ్ స్ట్రిప్ట్ లేకుండా ఈ సినిమాను మొదలెట్టండం ఓ తప్పైతే.. కోవిడ్ తో వచ్చిన గ్యాప్ మరింత ఇబ్బంది పెట్టిందని వెల్లడించారు.

అంతేకాదు…  ఏజెంట్ ఫెయిల్యూర్‌కు తాను ఎక్స్‌కూజెస్ చెప్పడం లేదని.. ఇది తమకు ఓ కాస్ట్లీ గుణపాఠం అని తన ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ మిస్టేక్ నుంచి తాము చాలా నేర్చుకున్నామని.. మరో సారి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామన్నారు. తమను… తమ సినిమాను నమ్ముకున్న వారి నమ్మకాన్ని వొమ్ము చేసినందుకు సారీ చెప్పారు. ఏజెంట్ తో వచ్చిన నష్టాలని.. తమ హార్డ్ వర్క్‌ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్స్‌తో… పూడుస్తామని తన ట్వీట్‌ను ముగించారు.

అంతేకాదు.. ఇప్పుడీ ట్వీట్ తో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు ఈ స్టార్ ప్రొడ్యూసర్ . వైరల్ అవ్వడమే కాదు.. తన సినిమా గురించి నిజాయితీగా.. ట్వీట్ చేసిన… ఆయన్ను.. నెట్టింట అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆకాశానికెత్తుతున్నారు. భారీ సినిమాలతో పాటు మంచి కథలు తెచ్చే కొత్త దర్శకులకు కూడా అవకాశాలివ్వండని సూచిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *