ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటెస్ట్ మూవీ భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తమిళ్ లో తెరకెక్కిన వేదలమ్ సినిమాకు రీమేక్ గా వస్తోంది ఈ సినిమా. తమిళ్ లో అజిత్ నటించిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. అజిత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగెస్ట్ హిట్ గా నిలిచింది ఈ మూవీ. ఇప్పుడు ఇదే సినిమాను మెహర్ రమేష్ భోళాశంకర్ అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే చిరంజీవి సిస్టర్ గా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. దాంతో భోళాశంకర్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమానుంచి నయా పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. నేడు( మే 1) కార్మికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమానుంచి చిరంజీవి పోస్టర్స్ ను రిలీజ్ చేశారు. భోళాశంకర్ సినిమాలో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా కనిపించనున్నారు. చిరు టాక్సీ డ్రైవర్ గెటప్ లో ఉన్న ఫోటోలను రిలీజ్ చేశారు మేకర్స్. టాక్సీ తో చిరంజీవి రకరకాల ఫోజులు ఇచ్చారు.

యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఏకే ఎంటర్టైనమెట్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు లేటెస్ట్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే తమన్ అదిరిపోయే బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఇచ్చాడని ఇన్ సైడ్ టాక్. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *