గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. తమిళంతోపాటు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యింది. మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది.

గతంలో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సినిమా బిచ్చగాడు. తమిళంతోపాటు తెలుగులోనూ పెద్ద హిట్ అయ్యింది. మల్టీ టాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. ఇక అంత పెద్ద హిట్ అందుకున్న చిత్రానికి సీక్వెల్ తీసుకురాబోతున్నట్లు అనౌన్స్ చేయడంతో బిచ్చగాడు 2 ప్రాజెక్ట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. తాజాగా విడుదలైన బిచ్చగాడు అనే ట్రాక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అప్పటి సినిమా ట్రీట్ ను గుర్తు చేస్తుంది. లక్ష కోట్లకు వారసుడిగా విజయ్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. తొలి పార్టులో లానే సీక్వెల్ లో దీక్ష పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో బ్రెయిన్ ట్రాన్స్ ప్లాంటేషన్ అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తెరకెక్కింది. ఇక ట్రైలర్ గమనిస్తే సీక్వెల్ చాలా గ్రాండియర్ గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమాకు ఉన్న అంచనాలన్నీ ట్రైలర్ తో రెట్టింపు అయ్యాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 19న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేయగా.. తాజాగా విడుదలైన ట్రైలర్ మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!


By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *