కొరియోగ్రాఫర్‌గా ఎంతో భవిష్యత్‌ ఉందనుకున్న చైతన్య హఠాత్తుగా సూసైడ్‌కు పాల్పడడం అందరినీ కలిచివేసింది. పలువురు ప్రముఖులు అతని మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్‌ మాస్టర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.

ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌, ఢీ డ్యాన్స్‌ షో కొరియా గ్రాఫర్‌ చైతన్య బలవన్మరణం అందరినీ షాక్‌కు గురిచేసింది. అప్పుల బాధ తట్టుకోలేక, తీవ్ర ఒత్తిడితోనే సూసైడ్‌ చేసుకుంటున్నట్లు ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియోను రిలీజ్‌ చేశాడు చైతన్య. అందులో తన సూసైడ్‌కు గల కారణాలను వివరంగా చెప్పుకొచ్చాడతను. కాగా కొరియోగ్రాఫర్‌గా ఎంతో భవిష్యత్‌ ఉందనుకున్న చైతన్య హఠాత్తుగా సూసైడ్‌కు పాల్పడడం అందరినీ కలిచివేసింది. పలువురు ప్రముఖులు అతని మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. డ్యాన్స్‌ మాస్టర్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. కాగా చైతన్య మాస్టర్‌ ఆత్మహత్యపై ప్రముఖ డ్యాన్సర్‌ కండక్టర్‌ ఝాన్సీ స్పందించింది. ‘చైతన్య అన్నయ్యా.. ఎందుకు ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నావ్‌’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ‘చైతన్య తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పుడు తన కుటుంబమంతా బాధపడుతోంది. తను డబ్బులు ఇవ్వాల్సిన వారితో కూర్చుని మాట్లాడాల్సింది. అందరూ తనతో కలిసి ప్రయాణం చేసినవాళ్లే. ఇప్పుడు నా పరిస్థితి ఇలాగే ఉంది. చనిపోవాలనిపిస్తుంది అని చెప్పిఉంటే ఈ విషాదం జరిగి ఉండేది కాదేమో’..

‘మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించేటంత కఠినాత్ములు కాదు. అన్నయ్యా.. ఎందుకింత తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడో అర్థం కావడం లేదు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటివారికి సాయం చేసేవాళ్లు. నాలుగైదు రోజుల క్రితమే చైతన్య మాస్టర్‌ను కలిశాను. నాకూ డ్యాన్స్ షోలో కనిపించాలనుంది, ఒక అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేశాను. దీనికి తర్వాతి సీజన్‌లో కచ్చితంగా ఛాన్స్‌ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయన ఎంత ఎదిగినా తన కింద ఉన్న కళాకారులకు ఎంతో గౌరవం, మర్యాద ఇస్తారు’ అని ఎమోషనలైంది డ్యాన్సర్ ఝాన్సీ.

 

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *