శివలీల గోపి తుల్వా |

Updated on: May 01, 2023 | 5:07 PM

Chanakya Niti: వ్యక్తి నుంచి మొదలుకుని కుటుంబం, సమాజం, దేశం ఎదుగుదల వరకు విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పుస్తకం పట్టినవాడిలో విచక్షణ, ఆలోచనా శక్తి, మేధస్సు ఉంటాయని చాణక్యుడు చెబుతుంటాడు. చాణక్యుడు స్వతహాగానే నీతి కోవిదుడు, అపర..

Chanakya Niti: ప్రత్యేకంగా వారి కోసమే.. అనుసరిస్తే శిఖరాగ్రాలను అధిరోహించడం ఖాయం..!

Chanakya Niti Tips For Students

Chanakya Niti: వ్యక్తి నుంచి మొదలుకుని కుటుంబం, సమాజం, దేశం ఎదుగుదల వరకు విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుంది. పుస్తకం పట్టినవాడిలో విచక్షణ, ఆలోచనా శక్తి, మేధస్సు ఉంటాయని ఆచార్య చాణక్యుడు చెబుతుంటాడు. చాణక్యుడు స్వతహాగానే నీతి కోవిదుడు, అపర మేధావి. వ్యక్తికి తన జీవితంలో ఎదురయ్యే సమస్యల బారి నుంచి ఎలా బయటపడాలో, వాటిని ఎలా నిరోధించాలో సవివరంగా తన ‘చాణక్య నీతి’లో పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే దేశానికి పునాదులైన విద్యార్థి తన విద్యాభ్యాస సమయంలో తప్పక గుర్తుంచుకోవలసిన విషయాలను గురించి కూడా వివరించాడు. మరి విద్యార్థుల కోసం చాణక్యుడు ఏయే సూచనలు, నీతి సూత్రాలను అందించాడో ఇప్పుడు చూద్దాం..

  1. ప్రతి మనిషి విజయంలో విద్య ముఖ్యపాత్ర పోషిస్తుందని చాణక్యుడు అమితంగా నమ్మాడు. పిల్లలకు చిన్నతనం నుంచే మంచి చదువు, సంస్కారం నేర్పితే భవిష్యత్తులో ఉన్నస్థాయికి చేరకుంటారని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. కానీ విద్యార్థి దశలోనే వారి కెరీర్‌ని దెబ్బతీసే తప్పులు కొన్ని ఉన్నాయి. వాటికి పిల్లలు దూరంగా ఉండేలా తల్లిదండ్రులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చాణక్యుడు సూచించాడు.
  2. మనిషి పతనానికి దురాశ కారణమని చాణక్యుడు నమ్మాడు. విద్యార్థులు చదువు పట్ల ఎంత అంకితభావంతో ఉంటే భవిష్యత్తులో అంతగా రాణిస్తారు. కానీ అత్యాశ అనే భ్రమలో చిక్కుకున్న విద్యార్థులు విజయపథం నుంచి పక్కకు తప్పుకుంటారు. అలాంటి వ్యక్తులు త్వరగా విజయం సాధించలేరని చాణక్యుడు పేర్కొన్నాడు.
  3. విద్యార్థి జీవితంలో క్రమశిక్షణ ఉన్నప్పుడే అతని భవిష్యత్తు మెరుగుపడుతుందని చాణక్యుడు నమ్మాడు. క్రమశిక్షణ విజయానికి మొదటి మెట్టుగా పరిగణించబడుతుంది. మంచి నిద్ర, మంచి ఆహారం విద్యార్థులకు ఔషధం లాంటివని, అది వారి విజయానికి ఆటంకం కలిగిస్తుందని చాణక్యుడు సూచించాడు.
  4. ఇంకా చెడ్డవారితో సాంగత్యం ఉన్న విద్యార్థి కూడా తన స్నేహితులలాగానే ప్రవర్తిస్తాడు. మంచి స్నేహితులు మాత్రమే మిమ్మల్ని విజయపథంలో నడిపిస్తారు. చెడ్డవారు ఎప్పుడు కూడా మిమ్మల్ని తప్పుడు మార్గంలోనే నడిపిస్తారు. అలా జరిగితే విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడినట్లే. ఎందుకంటే చెడ్డవారు చెడు వ్యసనాలు, కోరికలు వంటివాటిపై విద్యార్థుల దృష్టిని మలిచి వారి భవిష్యత్తుకు ప్రతిబంధకాలుగా మారుస్తారు.
  5. తనలో కోపం ఎక్కువగా ఉన్న విద్యార్థి తన జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటాడని చాణక్యుడు నమ్మాడు. ప్రశాంతమైన మనస్సు, సహనం ఉన్న విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపడుతుందని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నాడు. అలాగే తన కోపాన్ని అదుపులో ఉంచుకున్న వ్యక్తి ఎలాంటి అడ్డంకినైనా సులభంగా అధిగమిస్తాడని సూచించాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *