తాను ఎమ్మెల్యేగా ఉన్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లమని, బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని, నేర్చుకోవడం..

తాను ఎమ్మెల్యేగా ఉన్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లమని, బాబాసాహెబ్ అంబేద్కర్ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈ దేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి తాను చాలా నేర్చుకున్నానని, కానీ నేడు మహారాష్ట్రకు తానే నేర్పుతున్నానని, నేర్చుకోవడం నేర్పడం జ్జాన సముపార్జనలో భాగమని, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. నాడు తలఎత్తుకుని చూసిన మహారాష్ట్రను ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి రావడానికి ఇన్నాళ్లుగా అక్కడి ప్రభుత్వాలు అనుసరించిన బాధ్యతారాహిత్య నిర్లక్ష్యపూరిత ధోరణులే కారణమని కేసీఆర్‌ అన్నారు. సోమవారం ప్రగతి భవన్‌లో మహారాష్ట్రకు చెందిన పలువురు ముఖ్యనేతలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం, బలోపేతం పై చర్చించారు. పార్టీకి అనుబంధంగా పలు కమిటీల నిర్మాణంతో పాటు 288 నియోజకవర్గాల పరిధిలోని గ్రామాలు, రాష్ట్రవ్యాప్తంగా తాలూకాలు జిల్లాల వారీగా బీఆర్ఎస్ శాఖలను ఏర్పాటు చేసి పార్టీని నిర్మాణాత్మకంగా మరాఠా ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా కార్యాచరణపై మహారాష్ట్ర నుంచి వచ్చిన ముఖ్యనేతలతో కేసీఆర్‌ చర్చించారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ గొప్ప సామాజిక సాంస్కృతిక రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్ర లో పరిపాలన రోజు రోజుకూ దిగజారి పోతున్నది. మహారాష్ట్ర ప్రజలు గొప్ప చైతన్యవంతులు. వాల్ల జీవితాల్లో గుణాత్మాకాభివృద్ధిని తీసుకురావడానికి బీఆర్ఎస్ పార్టీ అహర్నిషలు కృషి చేస్తుంది. ఇప్పటికే.. మహారాష్ట్రలో బిఆర్ఎస్ పార్టీ అక్కడి ప్రజల ఆదరాభిమానాలను రోజు రోజుకూ చూరగొంటున్నది. అక్కడ పల్లెల్లో బీఆర్ఎస్ గురించి చర్చిస్తున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వాలను నడిపిన అక్కడి పార్టీలు వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయనే విషయాన్ని మరాఠా ప్రజలు గ్రహించారు. అదే సందర్భంలో తెలంగాణ ప్రగతి మోడల్ వారిని అమితంగా ఆకట్టుకుంటున్నది. బీఆర్ఎస్ నిర్వహించిన ప్రతి సభను విజయవంతం చేస్తూ పార్టీ పిలుపులో భాగస్వాములౌతూ వారు కనబరుస్తున్న ఉత్సాహం గొప్పగా ఉంది. నాడు తెలంగాణ ఉద్యమ సమయం మాదిరి నేడు మహారాష్ట్ర లో ప్రజా స్పందన స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు మహారాష్ట్రలో బీఆర్ఎస్ గాలి విస్తోందని అన్నారు.

మహారాష్ట్రలో మొదటి దశలో నాలుగు ముఖ్యపట్టణాలైన నాగపూర్, ఔరంగాబాద్, పూనే, ముంబై లల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 288 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలోని స్థానిక నేతలు ప్రతిరోజు గ్రామ గ్రామానికివెల్లి గ్రామ శాఖలను ఏర్పాటు చేయడం వంటి పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతూ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు సంబంధించి అన్ని రకాల ప్రచార సమాగ్రిని సిద్దం చేసి ఏర్పాట్లు పూర్తిచేసినట్టు సీఎం కేసీఆర్‌ తెలిపారు. కాగా మహారాష్ట్రంలో ఏ పార్టీతోని కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి అధినేత పార్టీలోకి ఆహ్వానించారు.

ఇవి కూడా చదవండిమరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed