Srilakshmi C |

Updated on: May 01, 2023 | 12:26 PM

రోజూ పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతి ఇంట్లోనూ దాదాపు ప్రతి రోజూ పెరుగు వినియోగిస్తుంటారు. పెరుగులో విటమిన్ బి, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రోజూ ఒక కప్పు..

Curd Side Effects: ఈ సమస్యలున్నవారు మర్చిపోయి కూడా పెరుగు తినకూడదు..

Curd Side Effects

రోజూ పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ప్రతి ఇంట్లోనూ దాదాపు ప్రతి రోజూ పెరుగు వినియోగిస్తుంటారు. పెరుగులో విటమిన్ బి, విటమిన్ బి12, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే రోజూ ఒక కప్పు పెరుగు తినడం అలవాటు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. ఐతే పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతున్నప్పటికీ కొన్ని రకాల వ్యాధులతో బాధపడేవారు అస్సలు తినకూడదంటున్నారు నిపుణులు. పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఏయే వ్యాధులతో బాధపడేవారు పెరుగుకు దూరంగా ఉండాలో, ఒకవేళ తింటే ఏమవుతుందో తెలుసుకుందాం..

పెరుగు ఎవరెవరు తినకూడదంటే..

  • కీళ్ల నొప్పులతో బాధపడేవారు పెరుగు తినకూడదు. ఇటువంటివారు పెరుగు తిన్నట్లైతే కీళ్ల నొప్పుల సమస్య మరింత పెరుగుతుంది.
  • ఆస్తమా సమస్యతో బాధపడేవారు కూడా పెరుగు తినకూడదు. పెరుగు తినడం వల్ల సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది
  • గ్యాస్, ఎసిడిటీ ఉన్నవారు పెరుగు తినకపోవడం మంచిది
  • చర్మానికి సంబంధించిన ఏదైనా సమస్య లేదా వ్యాధి ఉన్నట్లయితే, పెరుగు వినియోగానికి దూరంగా ఉండాలి. తామర, దురద, ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు పెరుగు అస్సలు తినకూడదు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *