ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసి మెప్పించారు గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ఆ తర్వాత ఫ్లాప్ లను చవిచూడాల్సి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటుకీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి.

హీరోగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత విలన్ గా మారి మెప్పించారు గోపీచంద్. వర్షం, నిజం సినిమాలతో తన విలనిజాన్ని చూపి ప్రేక్షకులను మెప్పించారు గోపిచంద్. ఆ తర్వాత యజ్ఞం సినిమాతో హీరోగా మారి సక్సెస్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస గా సినిమాలు చేసి మెప్పించారు గోపీచంద్. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న ఈ యాక్షన్ హీరో ఆ తర్వాత ఫ్లాప్ లను చవిచూడాల్సి వచ్చింది. వరుసగా సినిమాలు చేస్తున్నప్పటుకీ అవి ప్రేక్షకులను ఆకట్టుకోవడం లో మాత్రం ఫెయిల్ అయ్యాయి. అయితే ఎన్ని ఫ్లాప్ లు వచ్చిన గోపీచంద్ మాత్రం సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసి మీద ఉన్నారు ఈ టాల్ హీరో. ఇక త్వరలో రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

గోపీచంద్, డింపుల్ హయతి జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం. లక్ష్యం, లౌక్యం చిత్రాలతో ఆకట్టుకున్న డైరెక్టర్‌ శ్రీవాస్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాంతో ఈ సినిమాతో హ్యాట్రిక్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్. జగపతి బాబు, ఖుష్బూ ప్రధాన పాత్రలు పోషిస్తోన్న ఈ సినిమా మే 5న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ నిర్మించింది. ఇప్పటికే సినిమా నుంచి ట్రైలర్, సాంగ్స్ రిలీజై ప్రేక్షకులని అలరిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గోపీచంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కెరీర్ లో మంచి అంచనాలు పెట్టుకుని ఫ్లాపైన సినిమా గౌతమ్ నంద అని తెలిపారు. మంచి కథతో తెరకెక్కిన ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని అనుకోలేదని అన్నారు. గౌతమ్ నంద సినిమా మేకింగ్ లో చిన్నచిన్న తప్పులు ఉన్నాయని అయినప్పటికీ ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకుంటుందని భావించానని గోపీచంద్ చెప్పుకొచ్చారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *