Health Tips: టీ తాగడం వల్ల అలసిన శరీరానికి ఉపశమనంతో పాటు ఉత్సాహం వస్తుంది. అలసట పోవాలంటే కప్పు టీ తాగితే సరిపోతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే చాలా మందికి టీతో కలిపి బిస్కెట్స్, ఇతర ఆహార పదార్థాలను తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో చాయ్

Health tips related to Tea

Health Tips: టీ తాగడం వల్ల అలసిన శరీరానికి ఉపశమనంతో పాటు ఉత్సాహం వస్తుంది. అలసట పోవాలంటే కప్పు టీ తాగితే సరిపోతుందన్న విషయం మనకు తెలిసిందే. అయితే చాలా మందికి టీతో కలిపి బిస్కెట్స్, ఇతర ఆహార పదార్థాలను తినే అలవాటు ఉంటుంది. ఈ క్రమంలో చాయ్ ప్రియులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అని తేడా లేకుండా టీతో కలిపి ఇతర ఆహారాలను కూడా తీసుకుంటుంటారు. కానీ అలా కొన్ని పదార్థాలను తినడం మీ ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. ఇలా తీసుకోవడం వల్ల మీకు గ్యాస్, కడుపు మంట, గుండె పోటు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరి ఈ క్రమంలో టీతో కలిపి అసలు తీసుకోకూడని ఆహారాలేమిటో ఇప్పుడు చూద్దాం..

పండ్లు: చాలా మందికి ఉదయాన్నే టీ తాగుతూ, పండ్లను కూడా తినే అలవాటు ఉంటుంది. కానీ టీతో కలిపి లేదా టీ తాగిన వెంటనే పండ్లు తినకూడదు. రెండింటి మధ్య గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ప్రమాదం ఉంది.

పెరుగు: పెరుగును టీతో కలిపి తినకూడదు. పెరుగుతో  చేసిన పదార్థాలను కూడా తినకూడదు.

ఇవి కూడా చదవండి



ఐస్ క్రీమ్: వేడి టీ తాగుతూ చల్లని ఆహారాలను తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా చేస్తే వికారం, వాంతులు ప్రారంభమవచ్చు. టీ తాగిన తర్వాత కనీసం అరగంట వరకు చల్లని ఆహారం తినకూడదు.

ఆకుకూరలు: టీ తాగడానికి ముందు లేదా తాగిన అనంతరం ఐరన్‌తో ఉండే ఏ విధమైన ఆహారాలను కూడా తీసుకోకూడదు. ముఖ్యంగా ఆకు కూరల్ని అసలు తీసుకోకూడదు. టీలో టానిన్లు, ఆక్సలేట్‌లు కూరగాయలలోని ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. ఫలితంగా ఆరోగ్య పరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

శనగపిండి: సర్వసాధారణంగా టీ పాటు శనగపిండితో చేసిన పకోడీని కలిసి తింటారు. కానీ టీ తాగుతూ.. శనగపిండి పదార్ధాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు.

పసుపు: టీ తాగేటప్పుడు పసుపు ఉన్న ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. ఈ కాంబినేషన్ గ్యాస్, అసిడిటీ లేదా మలబద్ధకం వంటి సమస్యలను కలిగిస్తుంది. ఎందుకంటే పసుపు , తేయాకులు విరుద్ధ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి.

నిమ్మకాయ: బరువు తగ్గడానికి లెమన్ టీ బాగా ఉపయోగపడుతుంది. అయితే నిమ్మరసం, టీ కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య, కడుపు ఉబ్బరం ఏర్పడుతుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో లెమన్ టీ తాగడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లక్స్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో సిట్రస్ ఆహారాలు టీతో తినకూడదు.

పచ్చి ఉల్లిపాయలు: చాలా మందికి భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే పచ్చి ఉల్లిపాయలను టీతో కలిపి తినడం మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఉల్లిపాయల మాత్రమే కాక గుడ్డు, సలాడ్, మొలకెత్తిన గింజలు టీతో తీసుకోవటం మంచిది కాదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *