ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేసినస్పటికీ పింక్‌ ఆర్మీ పరాజయం పాలైంది. గతి తప్పిన బౌలింగ్‌కు తోడు.. టిమ్‌ డేవిడ్‌ విశ్వరూపం రాజస్థాన్‌కు మరో విజయాన్ని దూరం చేసింది. అయితే ఈమ్యాచ్‌లో రాజస్థాన్‌ కు చెందిన ఒక ఆటగాడు మాత్రం ఎంతో హైలెట్‌ అయ్యాడు. అతనే స్టార్‌ పేసర్‌ సందీప్‌ శర్మ.

గతేడాది రన్నరప్‌గా నిలిచిన రాజస్థాన్‌ రాయల్స్‌ ఈ ఏడాది కూడా అద్భుతంగా ఆడుతోంది. సంజూ శాంసన్‌ సారథ్యంలోని ఆ జట్టు ఈసారి ఎలాగైనా టైటిల్‌ను గెల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. అందుకు తగ్గట్టే దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తోంది. అయితే తాజాగా ముంబై ఇండియన్స్‌ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఆ జట్టు. ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 200కు పైగా పరుగులు చేసినస్పటికీ పింక్‌ ఆర్మీ పరాజయం పాలైంది. గతి తప్పిన బౌలింగ్‌కు తోడు.. టిమ్‌ డేవిడ్‌ విశ్వరూపం రాజస్థాన్‌కు మరో విజయాన్ని దూరం చేసింది. అయితే ఈమ్యాచ్‌లో రాజస్థాన్‌ కు చెందిన ఒక ఆటగాడు మాత్రం ఎంతో హైలెట్‌ అయ్యాడు. అతనే స్టార్‌ పేసర్‌ సందీప్‌ శర్మ. 213 పరుగుల లక్ష్య ఛేదనలో సూర్యకుమార్‌ యాదవ్‌ (55: 28 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. అయితే మరింత వేగంగా ఆడే ప్రయత్నంలో 15.3 ఓవర్‌ వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి చాలా సేపు గాల్లోకి లేచింది. అయితే సందీప్ శర్మ ఏకంగా 19 మీటర్లు ముందుకు పరుగెత్తి గాలిలోకి ఎగిరి కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నారు. దీనిని ఏ మాత్రం ఊహించలేదు సూర్య. దీంతో నిరాశగా పెవిలియన్‌ బాటపడ్డాడీ మిస్టర్‌ 360 డిగ్రీ ప్లేయర్‌.

కపిల్ ను గుర్తు చేశాడుగా..

సందీప్‌ శర్మ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సందీప్ క్యాచ్ చూడగానే 1983 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో కపిల్ దేవ్ పట్టిన క్యాచ్‌ గుర్తుకొస్తుందటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 1983 ప్రపంచకప్‌లో లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్‌ వివియన్ రిచర్డ్స్ కొట్టిన బంతిని కూడా ఇదే విధంగా పరిగెత్తి అద్భుతంగా అందుకున్నాడు . ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ యశస్వి జైస్వాల్ (124) అద్భుత సెంచరీ కారణంగా ఏడు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని చూసి ముంబై జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోవడం ఖాయంగా కనిపించింది. అయితే కామెరూన్‌ గ్రీన్, సూర్యకుమార్‌ యాదవ్‌, టిమ్‌ డేవిడ్‌ల విధ్వంసంతో ఆ జట్టు మరో 3 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇవి కూడా చదవండిమరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *