IPL 2023, LSG vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రన్ మిషిన్..

IPL 2023, LSG vs RCB: ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా నేడు జరగబోతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. లక్నో వేదికగా జరగబోయే ఈ మ్యాచ్‌ నేపథ్యంలో అందరి దృష్టి ఇప్పుడు రన్ మిషిన్ విరాట్ కోహ్లీ మీదే ఉంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఏ ప్లేయర్‌కి సాధ్యం కాని రికార్డుకు కోహ్లీ చేరువ కావడమే ఇందుకు కారణమని చెప్పుకోవాలి. ఐపీఎల్ 2023 సీజన్‌లో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 5 అర్ధ సెంచరీలు చేసిన విరాట్ కోహ్లి, లక్నో సూపర్‌జెయింట్స్‌పై 43 పరుగులు చేస్తే చాలు.. ఐపీఎల్ క్రికెట్‌లో 7000 పరుగులు పూర్తి చేసుకున్నతొలి ఆటగాడిగా అవతరిస్తాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో అత్యధికంగా 50+ స్కోర్లు సాధించిన భారత ఆటగాడిగా, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగతున్నాడు.

కాగా, ఐపీఎల్ ఆరంగేట్ర సీజన్ నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తరఫున మాత్రమే ఆడుతున్న కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 231 మ్యాచ్‌లు ఆడాడు. 223 ఇన్నింగ్స్‌లో 6,957 పరుగులు చేసిన కోహ్లీ 5 సెంచరీలను, 49 హాఫ్ సెంచరీలను కూడా కలిగి ఉన్నాడు. ఐపీఎల్‌లో కింగ్ కోహ్లీ స్ట్రైక్ రేట్ 129.72 గా కూడా ఉండడం మరో విశేషం. ఈ క్రమంలో ఈ రోజు కోహ్లీ తన బ్యాట్ నుంచి ఆ 43 పరుగులు రాబట్టగలిగితే ఒకే టీమ్ తరఫున 7 వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా ప్రత్యేక రికార్డును అందుకుంటాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed