మన్యం గిరుల్లో అరుదైన ఆ పుష్పాలు ముందే పూసాయి. చూడ చక్కని వర్ణంతో చూపరులను ఆకర్షిస్తున్నాయి. మే నెలలలో మాత్రమే కనిపించే అరుదైన పుష్పం అందాలను ఎంత చూసినా తక్కువే అనిపిస్తుంది చూపరులకు. 

అల్లూరి జిల్లా ఏజెన్సీలోని గిరుల్లో మే ప్లవర్స్ కనువిందుచేస్తున్నాయి. చూపరుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే అది కేవలం మే నెల రెండో వారంలోనే అతిధిలా కనిపించే పూలూ ఈసారి ఒక వారంముందే పూసాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, మల్లే, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా… మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాల లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి.

ఈ పూలను చూసిన చిన్నారులు… సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఈ పూల ఆకారం.. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉండడంతో సరదాగా అలా పిలుస్తున్నారు. స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందిన ఈ మే పూలు ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు. ఆంధ్రలో వాతావరణ పరిస్థితుల బట్టి కేవలం మే నెలలో మాత్రమే ఈ పూలు విరబూస్తాయి.

ఈ మే పుష్పాల మొక్కలు అల్లూరి జిల్లాలో దాదాపు ప్రతి ఇంట్లో కనిపిస్తుంటాయి. 15నుంచి 20 సెంటిమీటర్ల పొడవు ఉండే కాండం గల ఈ మొక్కలు.. బంతి ఆకారంలో ఉండి 50 నుంచి 200 వరకు పూలు పూస్తాయని ఉద్యాయనశాఖ అధికారులు చెప్పారు. మే నెలలో పూసే ఈ పూలు దేవుళ్లను పూజించేందుకు అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తుంటారని చెప్తున్నారు.

ఇవి కూడా చదవండిఖాజా, టీవీ9 తెలుగు, వైజాగ్

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *