ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన అభియోగాలు మోపింది ఈడీ. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొన్నారని ఈడీ పేర్కొంది. కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్ నుంచే జరిగాయంటోంది ఈడీ. హైదరాబాద్‌లో కవిత 3 ఆస్తులు కొనుగోలు చేశారని.. రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని

MLC Kavitha and Husband
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొత్త అభియోగాలు నమోదు చేసింది ఈడీ. ఇందులో భాగంగా మూడో ఛార్జిషీట్‌లో సంచనల విషయాలు బయటపెట్టింది ఈడీ. మాగుంట శ్రీనివాస్‌రెడ్డి, రాఘవ, కవిత, శరత్‌పై కొత్త అభియోగాలు చేర్చింది. హవాలా, ముడుపులు, భూముల కొనుగోళ్లపై ఈడీ ప్రస్తావన చేసింది. రూ.100కోట్ల ముడుపులపై ఆధారాలు దొరికాయంటోంది ఈడీ. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై సంచలన అభియోగాలు మోపింది ఈడీ. లిక్కర్ లాభాలతో అరుణ్ పిళ్లై ద్వారా భూములు కొన్నారని ఈడీ పేర్కొంది. కొనుగోళ్ల లావాదేవీలు పిళ్లై అకౌంట్ నుంచే జరిగాయంటోంది ఈడీ. హైదరాబాద్‌లో కవిత 3 ఆస్తులు కొనుగోలు చేశారని.. రాజకీయ పలుకుబడితో తక్కువ రేటుకు భూములు దక్కించుకున్నారని అభియోగం మోపింది. ఈడీ ఛార్జ్‌షీటులో కవితతో పాటు భర్త అనిల్ కుమార్ పేరును చేర్చింది. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవితకు ఫీనిక్స్‌కు చెందిన శ్రీహరి సహకరించారంటోంది ఈడీ.