ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో అందాలు ఆరబోసి ఆకట్టుకుంది నిధి. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటుంది.
నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ నిధి అగర్వాల్. మొదటి సినిమాలో నటనతో ఆకట్టుకున్న ఈ చిన్నది. ఆ తర్వాత నాగ చైతన్య తమ్ముడు అఖిల్ తో నెక్స్ట్ సినిమా చేసింది ఈ హాట్ బ్యూటీ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నిధి నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుంది. ఈ సినిమాలో అందాలు ఆరబోసి ఆకట్టుకుంది నిధి. ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు ఈ అమ్మడు క్రేజీ ఆఫర్స్ ను అందుకుంటుంది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
హిస్టారికల్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యువరాణిగా కనిపించనుంది నిధి అగర్వాల్. ఇప్పటికే ఈ భామ షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ఇదిలా ఉంటే ఈ చిన్నదని పై పలు ట్రోల్స్ కూడా వచ్చాయి. ఈ అమ్మడికి ఒక్క హిట్ కూడా దక్కలేదు.
దాంతో ఈ భామను బ్యాడ్ లక్ బ్యూటీ అంటూ పలు ట్రోల్స్ జరుగుతున్నాయి. తాజాగా ఈ ట్రోల్స్ పై స్పందించింది నిధి అగర్వాల్. నిధి మాట్లాడుతూ.. నటన విషయంలో తానే కాదు పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరని తెలిపింది. అదే విధంగా నటన గురించి అందరికీ అన్ని విషయాలు తెలియవు అని చెప్పుకొచ్చింది. తన నటనకు మెరుగులు దిద్దుకుంటున్నట్లు చెప్పిన నిధి.. ఇక పై మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించాలని ఉందని తెలిపింది నిధి అగర్వాల్.