ఈ సినిమా ఫస్ట్ పార్ట్ ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ కూడా బాక్సాఫీస్ వద్ద అంతకంటే ఎక్కువగా వసూళ్లు చేస్తుందని మేకర్స్​ భావిస్తున్నారు. ఈ కథను క‌ల్కి కృష్ణ‌మూర్తి ర‌చించిన న‌వ‌ల ఆధారంగా రూపొందించారు.

మొన్న అటు మొన్నటి వరకు మణిరత్నం సినిమాల్లో మ్యాజిక్ తగ్గిందనే కామెంట్ వినిపించేది. కానీ ఆ కామెంట్‌ను పీఎస్ 1తో… ఒక్క వేటుతో పక్కకు పోయేలా చేశారు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం. పక్కకు పోయేలా చేయడమే కాదు.. పీఎస్ 1తో దిమ్మతిరిగే కూడా హిట్ కొట్టారు. దాదాపు 500కోట్ల పైగా వసూళ్లను రాబట్టారు. ఇక తాజాగా ఇదే జోష్‌లో…. తన పీఎస్2తో కూడా దిమ్మతిరిగే వసూళ్లను కంటిన్యూ చేస్తున్నారు ఈ స్టార్ డైరెక్టర్‌.

9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేప‌థ్యంలో తమిళ్ సాహిత్యంలోనే గొప్ప నవలలో ఒకటిగా భావించే పొన్నియన్‌ సెల్వన్‌ను.. రెండు పార్ట్స్‌గా మార్చి పొన్నియన్ సెల్వన్ వన్ అండ్ టూ గా చిత్రీకరించిన మణిరత్నం… ఫస్ట్ పార్ట్‌కు కొనసాగింపుగా.. సెకండ్ పార్ట్‌ను తీసుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. రిలీజ్ చేయడమే కాదు.. డే1 నుంచే సూపర్ డూపర్ టాక్ వచ్చేలా చేసుకున్నారు.

ఇక అదే జోష్‌లో.. అదే ఊపులో.. తాజాగా పొన్నియన్ సెల్వన్ 2 ఫిల్మ్ రికార్డ్స్‌ లెవల్ కలెక్షన్స్‌ను రాబట్టుకుంటోంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే.. ఆల్ ఓవర్ వరల్డ్ 150కోట్ల వసూళ్లను రాబట్టింది. అలాగే నార్త్‌ యూఎస్‌లో.. మూడు మిలియన్ డాలర్ల కలెక్షన్స్‌ను వచ్చేలా చేసుకుంది. దాంతో పాటే… మరోసారి మణీస్ డైరెక్టోరియల్ మ్యాజిక్ ఏంటో అందరికీ చూపించేస్తోంది ఈ సినిమా..!. వరల్డ్ వైడ్ ​సుమారు 3200 కంటే ఎక్కువ స్క్రీన్‌లలో విడుదలైన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్​లోనే రూ.170కోట్ల మేర వసూళ్లు చేసినట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, జయం రవి, ప్రకాష్ రాజ్ ఐశ్వర్య రాయ్, త్రిష, శోభితా ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి లాంటి స్టార్స్​ ఈ సినిమాలో కీ రోల్స్ పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed