మళ్ళీ నేటి తరానికి గుమ్మడిని గుర్తు చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్. తనకంటే వయసులో పెద్దవారైనా హీరోలకు తండ్రిగా, మామయ్యగా నటించారు. అంతేకాదు తనకంటే పెద్దదైన నటికి భర్తగా, అన్నగా నటించి మెప్పించారు. ప్రకాష్ రాజ్ ఏ పాత్రలో నటించినా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు.

వెండి తెరపై తనకంటే వయసులో పెద్దవారైనా నటులకు తండ్రి, అన్న, భర్త, అమ్మ, అక్క, వదిన వంటి పాత్రల్లో నటించిన నటీనటులు ఉన్నారు. గుమ్మడి వెంకటేశ్వరరావు తన కంటే పెద్దవారైనా ఎన్టీఆర్, ఏ ఎన్నార్ లకు తండ్రిగా, అన్నగా కుటుంబ పెద్దగా అనేక సినిమాల్లో నటించారు. మళ్ళీ నేటి తరానికి గుమ్మడిని గుర్తు చేస్తున్న నటుడు ప్రకాష్ రాజ్. తనకంటే వయసులో పెద్దవారైనా హీరోలకు తండ్రిగా, మామయ్యగా నటించారు. అంతేకాదు తనకంటే పెద్దదైన నటికి భర్తగా, అన్నగా నటించి మెప్పించారు. ప్రకాష్ రాజ్ ఏ పాత్రలో నటించినా తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తారు. కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ ఇలా ఏ పాత్రలో నటించినా మెప్పించే టాలెంటెడ్ యాక్టర్.

అయితే ప్రకాష్ రాజ్ తెలుగు తెరకు విలన్ గా పరిచయం అయిన చూడాలని ఉంది సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి పిల్లనిచ్చిన మామయ్యగా నటించారు. చిరు కంటే ప్రకాష్ రాజ్ వయసులో చిన్నవాడు. అంతేకాదు సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో విక్టరీ వెంకటేష్ కు తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్.. నిజ జీవితంలో వెంకీ కంటే చిన్నవాడే.. ప్రకాష్ రాజ్ వయసు 58 ఏళ్ళు.. కాగా వెంకటేష్ వయసు 64 ఏళ్ళు. దాదాపు ప్రకాష్ రాజ్ కంటే వెంకటేష్ ఆరేళ్ళు పెద్దవాడు.

ఇక ప్రకాష్ రాజ్ జయసుధల జంట వెండి తెరపై అలరిస్తూనే ఉంటుంది. వీరిద్దరూ భార్యాభర్తలుగా కొత్తబంగారు లోకం, బొమ్మరిల్లు, గోవిందుడు అందరివాడేలే, శతమానం భవతి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అంతేకాదు బాణం సినిమాలో ప్రకాష్ రాజ్ చెల్లెలుగా జయసుధ నటించింది.. వాస్తవానికి జయసుధ ప్రకాష్ రాజ్ కంటే వయసులో పెద్దది. ప్రకాష్ రాజ్ వయసు 58 కాగా, జయసుధ వయసు 64 ఏళ్లు. ప్రకాష్ రాజ్ కంటే జయసుధ ఆరేళ్ళు పెద్దది.

ఇవి కూడా చదవండిమరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *