ఈ నెల 8వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్నట్లుగా సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీ సరూర్ నగర్‌లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే, ప్రియాంక గాంధీ ఈ నెల 5వ తేదీనే తెలంగాణకు వస్తారని ఇటీవల టీ- కాంగ్రెస్ తెలిపింది. ప్రియాంక గాంధీ ప్రస్తుతం..

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు అయ్యింది. ఈ నెల 8వ తేదీన ప్రియాంక గాంధీ హైదరాబాద్‌కు రానున్నట్లుగా సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రియాంక గాంధీ సరూర్ నగర్‌లో తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు. అయితే, ప్రియాంక గాంధీ ఈ నెల 5వ తేదీనే తెలంగాణకు వస్తారని ఇటీవల టీ- కాంగ్రెస్ తెలిపింది. ప్రియాంక గాంధీ ప్రస్తుతం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో ఏఐసీసీ తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించిన షెడ్యూల్‌ను మార్చింది. ఏఐసీసీ మార్చిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 8వ తేదీన ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు.

రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యలపై సమరభేరి మోగించడం ద్వారా యువతను కాంగ్రెస్‌ వైపు తిప్పుకునేందుకు పీసీసీ ప్రణాళికలు సిద్దం చేసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు చెందిన ప్రశ్నాపత్రాలు లీక్‌ కావడంపై.. కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించింది. వర్షిటీల్లో నిరుద్యోగ నిరసన దీక్ష సభలు ఏర్పాటు చేయాలని పీసీసీ ప్లాన్ చేసింది.

ఇదిలావుంటే, అర్ధాంతరంగా నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి మొదలు పెట్టేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి రెడీ అవుతున్నారు. మే 9వ తేదీ నుంచి రెండో విడత “హాథ్‌ సే హాథ్‌ జోడో” యాత్రను 32 నియోజక వర్గాల్లో నిర్వహిస్తామన్నారు. జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *