ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన ఆర్టీఏ సమాచారాన్ని అందించాలని రేవంత్ రెడ్డి స్వయంగా దరఖస్తు చేశారు. ఈమేరకు మాసబ్ ట్యాంక్ MAUD ఆఫీసులోని సెక్షన్ ఆఫీసర్‌కు దరఖాస్తు ఇచ్చారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలు తెలపాలని రేవంత్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆర్టీఏకి దరఖాస్తు చేసుకున్నారు.

ఔటర్ రింగ్‌ రోడ్డుని 30 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వడం వెనుక పెద్ద స్కామ్ ఉందని ఆరోపించారు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి. ఓఆర్ఆర్‌ని కాపాడుకోవడానికి న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ లీజు వ్యవహారం వెనుక మంత్రి కేటీఆర్.. ఆయన వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఎంపీ రేవంత్‌రెడ్డి. అంతకుముందు రేవంత్‌ రెడ్డి సెక్రటేరియట్ ఎపిసోడ్ హైడ్రామా క్రియేట్ చేసింది. ఔటర్‌ రింగ్‌రోడ్డు టెండర్‌పై ఫిర్యాదు చేసేందుకు సచివాలయం బయల్దేరిన రేవంత్‌ను మధ్యలోనే అడ్డుకున్నారు పోలీసులు. టెలిఫోన్ భవన్‌ దగ్గరే ఆపేశారు. కాసేపు అక్కడే ఉన్న రేవంత్‌ పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు రేవంత్‌రెడ్డి వస్తారన్న సమాచారంతో సచివాలయం వద్ద కూడా పోలీసులు కాసేపు హడావుడి చేశారు. విజిటర్స్ గెట్‌ని పూర్తిగా మూసేశారు.

హెచ్‌ఎండీఏ ఆఫీస్‌ను ఇంకా పూర్తిస్థాయిలో కొత్త సచివాలయానికి తరలించలేదని రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లారు పోలీసులు. వినతిపత్రం ఇవ్వాలంటే మసబ్‌ట్యాంక్‌లోని హెచ్‌ఎండీఏ ఆఫీస్‌కు వెళ్లాలని సూచించారు. ఆయన అంగీకరించడంతో..మసబ్ ట్యాంక్ తీసుకెళ్లారు. అయితే అక్కడ కూడా మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్‌తో సహా ఇతర అధికారులెవరూ లేకపోవడంపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఔటర్‌ రింగ్‌రోడ్డుని ఇటీవలే 30 ఏళ్లపాటు లీజుకి ఇచ్చింది ప్రభుత్వం. 7 వేల 380 కోట్లకు టెండర్‌ వేసిన ముంబైకి చెందిన ఓ ప్రైవేట్‌ సంస్థ ఈ లీజుని దక్కించుకుంది. అయితే ఈ వ్యవహారంలో వెయ్యి కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ORRను 30 ఏళ్ల పాటు లీజుకిస్తే సుమారు 30 వేల కోట్ల ఆదాయం వస్తుందన్నది కాంగ్రెస్ వర్షన్.

ఓఆర్ఆర్ టెండర్లకు సంబంధించిన ఆర్టీఏ సమాచారాన్ని అందించాలని రేవంత్ రెడ్డి స్వయంగా దరఖస్తు చేశారు. ఈమేరకు మాసబ్ ట్యాంక్ MAUD ఆఫీసులోని సెక్షన్ ఆఫీసర్‌కు దరఖాస్తు ఇచ్చారు. టెండర్ ప్రక్రియలో పాల్గొన్న కంపెనీలు, టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన కంపెనీల వివరాలు తెలపాలని రేవంత్‌ను పోలీసులు అడ్డుకోవడంతో ఆర్టీఏకి దరఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *