ప్రముఖ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించి మెప్పించారామె. అయితే ఈ మధ్యన సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా ఉంటోందీ అందాల తార. కూతురు సుప్రీతతో కలిసి సామాజిక మాధ్యమాల్లో తెగ రచ్చ చేస్తోంది.

ప్రముఖ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించి మెప్పించారామె. అయితే ఈ మధ్యన సినిమాల కంటే సోషల్‌ మీడియాలోనే ఎక్కువగా ఉంటోందీ అందాల తార. కూతురు సుప్రీతతో కలిసి సామాజిక మాధ్యమాల్లో తెగ రచ్చ చేస్తోంది. మోడ్రన్‌ అండ్‌ గ్లామరస్‌ డ్రెస్సుల్లో కూతురితో డ్యాన్స్‌ వీడియోలతో నెట్టింట సందడి చేస్తోంది. కొన్నిసార్లు ఆమె ఫొటోలు, వీడియోలపై ట్రోలింగ్‌ వచ్చినా పట్టించుకోకుండా ముందుకు సాగుతుందామె. ఇవాళ (ఏప్రిల్‌30) సురేఖా వాణి పుట్టిన రోజు. తన కూతురితో కలిసి బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఇదే సందర్భంలో తన భర్తను తల్చుకుని ఎమోషనలైంది. తన భర్త ఫొటో పక్కనే బర్త్‌డే కేక్‌ను సెలబ్రేట్‌ చేసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసిన సురేఖా వాణి.. ‘ నా కళ్లలో సంతోషం కన్నా నువ్వు నా పక్కన నువ్వు లేవన్న బాధే ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ మాతోనే ఉంటాయి అని తెలుసు. నా ప్రతి బర్త్‌డేకి నువ్వు చేసే హంగామా, హడావిడి ఇప్పటికీ నాకు గుర్తుంది. నిన్ను చాలా మిస్‌ అవుతున్నా. లవ్‌ యూ ఫర్‌ ఎవర్‌’ అని ఎమోషనలైంది సురేఖ.

అలాగే మరో పోస్టులో ‘నా కుటుంబమే నా బలం. కన్నా (కూతురు సుప్రీత) కష్ట సుఖాల సమయంలో నాతో ఉన్నందుకు ధన్యవాదాలు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నేను ఎప్పటిలాగే మీ నాన్నను మిస్ అవుతున్నాను. మేము మరింత శక్తితో తిరిగి పుంజుకుంటాం’ అని రాసుకొచ్చింది సురేఖ. ఇక సుప్రీత కూడా తన తల్లికి పుట్టిన రోజు విషెస్‌ తెలిపింది. ‘ హ్యాపీ బర్త్‌ డే టు మై లైఫ్‌ లైన్‌. నువ్వు లేకుంటే నేను లేను. నేను ఎప్పటికీ నిన్నూ ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీ బర్త్‌ డే అమ్మా’ అని విషెస్‌ చెప్పంది సుప్రీత.ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి. పలువురు నెటిజన్లు సురేఖా వాణికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సురేష్ తేజ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సురేఖ. అయితే 2019 లో అనారోగ్యంతో సురేశ్ తేజ కన్నుమూశాడు.

ఇవి కూడా చదవండి



సురేఖా వాణి పోస్టులు

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *