ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ అనే అంశంపై కేరళలో పెద్ద వివాదం నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే దీనిపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు.

ప్రస్తుతం ‘ది కేరళ స్టోరీ’ అనే అంశంపై కేరళలో పెద్ద వివాదం నడుస్తోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. అయితే దీనిపై పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. ఆ చిత్ర పోస్టర్‌ను షేర్ చేసిన ఆయన.. ‘ఇది మీ కేరళ కథ కావొచ్చు. కానీ మా కేరళ కథ మాత్రం కాదు’ అంటూ చిత్ర నిర్మాతలను చురకలు అంటించారు. కేరళలో కొన్నేళ్లుగా 32 వేల మంది మహిళలు అదృశ్యమైనట్లు వస్తోన్న ఆరోపణలపై వారి ఆచూకీ ఎక్కడుందనే కథనంతో ఈ చిత్రాన్ని దర్శక,నిర్మాతలు రూపొందించారు.

అయితే ఈ ఆరోపణలపై కేరళ స్టేట్‌ కమిటీ ఆఫ్‌ ముస్లిం యూత్ లీగ్ కూడా సవాలు విసిరింది. ఈ సినిమాలో చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా ఎవరైన నిరూపిస్తే వారికి రూ.కోటి ఇస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో ఆధారాల స్వీకరణ కోసం కలెక్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పింది. ఈ సవాలు గురించి శశిథరూర్‌ ట్విటర్‌లో స్పందించారు. NotOurKeralaStory అనే హ్యాష్‌ ట్యాగ్‌ను షేర్ చేశారు.

మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ కూడా సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని మత తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించేకు యత్నిస్తూ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సినిమా వివాదంపై చిత్ర దర్శకుడు సుదీప్తో సేన్‌ గుప్తా కూడా స్పందించారు. ముందుగా సినిమా చూడండి. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు చర్చిద్దామంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *