ఈమె ఎవరో గుర్తుపట్టగలరా..? డాక్టర్ చదవాల్సిన ఈ అమ్మాయి అనుకోకుండా యాక్టర్ అయ్యింది. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోయిన్‌గా రాణించింది. హోమ్లీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. తనెవరో గుర్తుపట్టగలరా..?

అందం, అభియనంతో ఆకట్టుకునే హీరోయిన్స్ కోకొల్లలు ఉంటారు. కానీ తన ఆఫ్ స్క్రీన్ ప్రవర్తనతో కూడా ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకునే వాళ్లు  చాలా అరుదు. అప్పట్లో మహానటి సావిత్రి.. సారీ.. సారీ సావిత్రి గారి మంచి మనసు గురించి తెలుగునాట కథలు కథలుగా చెప్పేవారు. ఆ తర్వాతి కాలంలో అంతటి పేరు తెచ్చుకున్న నటీమణి ఎవరంటే.. వెంటనే గుర్తొచ్చే పేరు సౌందర్య. ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ సౌందర్య ఇచ్చిన ఇంపాక్ట్ ఎప్పటికీ చెక్కుచెదరినిది. ఆమె ప్రేక్షకుల మదిలో పర్మనెంట్ ప్లేస్ సంపాదించుకున్నారు. చక్కటి చీరకట్టులో, నిండైన రూపంతో..  పదహారణాల తెలుగింటి అమ్మాయిలా కనిపించి.. అరె ఈ అమ్మాయి మన ఇంటి అమ్మాయిలానే ఉంది కదా అన్న పేరు సంపాదించుకున్నారు.

ఆమె ఎక్స్‌పోజింగ్ అనే పదానికి ఆమడదూరం. గ్లామర్ హీరోయిన్లు చక్రం తిప్పుతున్న సమయంలో..  అలాంటి పాత్ర ఒక్కటి కూడా చేయకుండానే టాప్ ప్లేస్ దక్కించుకున్నారంటే సౌందర్య స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే అనుకోకుండా ఓ విమాన ప్రమాదంలో కేవలం 32 ఏళ్లకే ఆమె లోకాన్ని వీడారు. అభినవ సావిత్రగా పేరు పొందిన సౌందర్య మరణంతో అప్పట్లో తెలుగు జనం తల్లిడిల్లిపోయారు. తన ఇంటి బిడ్డను పోగొట్టుకున్నట్లుగా బాధపడ్డారు. సినిమాలలో ధ్రువతారగా సౌందర్యకు ఎప్పటికీ మరణం లేదని ఆమె ఫ్యాన్స్ చెప్పే మాట.

కన్నడ రాష్ట్రానికి చెందిన సౌందర్య తెలుగు ఎంత బాగా మాట్లాడుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఆమె తెలుగువారు కాదని ఇప్పటికీ చాలామందికి తెలియదు.  కాగా పైన ఫోటోలో ఉన్నది చిన్నప్పటి సౌందర్యనే. పోలికలు చూసి కొందరు ఆమెను గుర్తిస్తున్నారు. మరికొందరు బోల్తా పడుతున్నారు. కాగా ప్రజంట్ సౌందర్య చిన్నప్పటి ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది.

Soundarya

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *