సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డు ప్రమాదం తర్వాత చాలా రోజులు గ్యాప్‌ తీసుకున్న సాయి ధరమ్‌ సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్‌, అతింద్రియ శక్తుల చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. కలెక్షన్ల విషయంలో దుమ్మురేపుతోందీ మూవీ…

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోడ్డు ప్రమాదం తర్వాత చాలా రోజులు గ్యాప్‌ తీసుకున్న సాయి ధరమ్‌ సాలిడ్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు. థ్రిల్లర్‌, అతింద్రియ శక్తుల చుట్టూ తిరిగే కథాంశంతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను కట్టిపడేసింది. కలెక్షన్ల విషయంలో దుమ్మురేపుతోందీ మూవీ. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన విరూపాక్ష ఏకంగా రూ. 100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతోంది. ప్రస్తుతం 10 రోజులకుగాను రూ. 76 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ఇప్పట్లో మరో సినిమా లేకపోవడం, సమ్మర్‌ హాలీడేస్‌ కూడా ఉండడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇదిలా ఉంటే విరూపాక్ష సినిమా క్లైమాక్స్‌ డైరెక్టర్ సీక్వెల్‌పై ఒక చిన్న హింట్‌ ఇచ్చి వదిలేశాడు. దీంతో ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ఉంటుందా.? ఉంటే ఎప్పుడు మొదలువుతుంది.? అని ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే తాజాగా దర్శకుడు కార్తీక్‌ దండు విరూపాక్ష సీక్వెల్‌పై ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఆదివారం చిత్ర యూనిట్ హైదారబాద్‌లో ఏర్పాటు చేసిన థ్యాంక్యూ మీట్‌లో విరూపాక్ష సీక్వెల్‌పై స్పందించాడు. విరూపాక్ష మొదటి పార్ట్‌ నుంచి ప్రేక్షకులు బయటకొచ్చే సమయానికి రెండో పార్ట్‌ను తీస్తానని స్పష్టం చేశారు. దీంతో సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చినట్లైంది.

మాట కూడా సరిగ్గా రాలేదు: సాయితేజ్‌

ఇక విరూపాక్ష చిత్ర షూటింగ్‌ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి స్పందించారు హీరో సాయి ధరమ్‌ తేజ్‌. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘విరూపాక్ష షూటింగ్‌ సమయంలో నాకు మాట కూడా సరిగ్గా రాలేదు. కానీ, మా అమ్మ.. సెట్లోని నటీనటులు, దర్శకుడు, సాంకేతిక సిబ్బంది.. అందరూ నాకెంతో సహకరించారు. అందుకే అందరికీ కృతజ్ఞతలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఇందులోని నటీనటుల్ని, సాంకేతిక సిబ్బందిని ఎంతో మెచ్చుకుంటున్నారు. అజనీస్‌ సంగీతం, శ్యామ్‌ దత్‌ ఫొటోగ్రఫీ సహా ప్రతిఒక్క క్రాఫ్ట్‌ను అభినందిస్తున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed