Actress

సినిమా తారల చిన్ననాటి ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంటాయి. అభిమానులు కూడా వీటిని చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సినిమా హీరోలు, హీరోయిన్లు కూడా తమ పుట్టిన రోజు, ఇతర ప్రత్యేక దినాల్లో తమ చిన్ననాటి ఫొటోలను షేర్ చేస్తుంటారు. తమ బాల్యం నాటి మధురు జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకుంటారు. అలా తాజాగా ఒక త్రోబ్యాక్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్నపాపాయి ఇప్పుడు ఓ స్టార్‌ హీరోయిన్‌. సుమారు 2 దశాబ్దాలకు పైగా దక్షిణాది సినిమాల్లో నటిస్తోంది. వయసు 40 ఏళ్లు దాటిపోయినా చెక్కు చెదరని అందం ఆమెది. ఇప్పటికీ తన సొగసు, అభినయంతో యంగ్‌ హీరోయిన్లకు గట్టి పోటీనిస్తోంది. ఇటీవలే ఓ పీరియాడికల్‌ మూవీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ అందాల తార. మరి మరో రెండు రోజుల్లో పుట్టిన రోజు జరుపుకుంటోన్న ఈ పాపాయి ఎవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌. సమాధానం మేమే చెబుతా.. ఆమె మరెవరో కాదు ఇటీవల పొన్నియన్‌ సెల్వన్‌ లో కుందవై పాత్రలో కనువిందు చేసిన అందాల తార త్రిష.

ప్రముఖ కథానాయిక త్రిష మరో రెండు రోజుల్లో (మే4) పుట్టిన రోజు జరుపుకోనుంది. ఈ బర్త్‌డే ఆమెకు చాలా స్పెషల్‌ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె నటించిన పొన్నియన్‌ సెల్వన్‌ 2 బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. కేవలం 3 రోజుల్లోనే 150 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇక త్రిష పోషించిన కుందవై పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం ఆమె చేతిలో సుమారు అరడజను సినిమాలున్నాయి. ముఖ్యంగా విజయ్‌తో కలిసి నటిస్తోన్న లియోపై భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో పాటు మోహన్‌లాల్‌ రామ్‌: పార్ట్‌ 1, ది రోడ్‌, సతురంగ వెట్టై2 సినిమాలున్నాయి.

త్రిష లేటెస్ట్ ఫొటోస్..

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

 

View this post on Instagram

 

A post shared by Trish (@trishakrishnan)

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed