బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టి కమర్షియల్ హిట్ సాధించిన ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని ఊరురా ఫ్రీ స్క్రీన్స్ వేసి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి ఇంటింటికి చేరనుంది. అంటే.. ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యిందీ మూవీ.

ఎలాంటి అంచనాలు హడావిడి లేకుండా థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం బలగం. ఈ సినిమా అందుకున్న విజయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎమోషనల్ కంటెంట్‏తో రూపొందిన ఈ సినిమాకు జనాలు బ్రహ్మారథం పట్టారు. జబర్దస్త్ ఫేం వేణు యెల్దండి దర్శకత్వం వహించిన బలగం చిత్రం ప్రతి ప్రేక్షకుడిని కంటతడి పెట్టింది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లు రాబట్టి కమర్షియల్ హిట్ సాధించిన ఈ సినిమా ఆ తర్వాత ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ అందుకుంది. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని ఊరురా ఫ్రీ స్క్రీన్స్ వేసి ప్రదర్శించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ప్రతి ప్రేక్షకుడి ఇంటింటికి చేరనుంది. అంటే.. ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటేందుకు రెడీ అయ్యిందీ మూవీ.

బలగం సినిమా స్టార్ మా ఛానల్లో మే 7న సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా వస్తున్న ఈ మూవీకి బుల్లితెర ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‏ను అందిస్తారో చూడాలి. మనస్పర్థలతో కుటుంబాలు విచ్చిన్నమైతే పెద్దవారి ఆత్మలు ఎంతగా క్షోభిస్తాయో ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ వేణు. ఈ చిత్రాన్ని దిల్ రాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షితా రెడ్డి, హర్షిత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండిఇదిలా ఉంటే.. ఈ సినిమా చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోకు 13వ దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డ్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా అంతర్జాతీయ వేదికపై ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *