IPL 2023, SRH vs KKR : ఈ నెల 4న ఉప్ప‌ల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్( IPL Match ) జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో గురువారం మ‌ధ్యాహ్నం 3:30 గంట‌ల నుంచి రాత్రి 11:30 గంట‌ల వ‌ర‌కు స్టేడియం( Uppal Stadium ) ప‌రిస‌రాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు( Traffic Restrictions ) విధించారు.

ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మ్యాచ్‌ దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు మరోసారి ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించారు. గురువారం, హైదరాబాద్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య రాత్రి 7:30 గంటలకు IPL మ్యాచ్‌ జరగనుంది.

రాచకొండ ట్రాఫిక్ పోలీసులు జారీ చేసిన ప్రకటన ప్రకారం, మే 4 మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 11:30 వరకు ఆంక్షలు వర్తిస్తాయి. అన్ని రకాల భారీ వాహనాలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.

ఈ మేరకు ఉప్పల్ స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు పెడుతున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలు ,ట్రక్కులు, వాటర్ ట్యాంక్ లు ఇతర భారీ వాహనాలకు స్టేడియం చుట్టుపక్కలకు అనుమతి నిరాకరించినట్లు వారు తెలిపారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *