నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి అవార్డ్ లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఈ అవార్డ్ వచ్చినట్లు తెలుస్తోంది. దహిణి ది విచ్ అనే సినిమాలో ఆయన నటనకుగానూ ఈ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్ లభించింది.
తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో జేడీ చక్రవర్తి ఒకరు. విలక్షణమైన సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఆ తర్వాత సహాయ నటుడిగా.. ప్రతినాయకుడిగా మెప్పించారు. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న జేడీ చక్రవర్తికి తాజాగా అరుదైన గౌరవం దక్కింది. నైజీరియాలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎకో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జేడీ చక్రవర్తికి అవార్డ్ లభించింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కేటగిరిలో ఈ అవార్డ్ వచ్చినట్లు తెలుస్తోంది. దహిణి ది విచ్ అనే సినిమాలో ఆయన నటనకుగానూ ఈ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డ్ లభించింది.
ఈ సినిమా ఇది వరకు ఆస్ట్రిలియాలోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా అవార్డ్ అందుకుంది. ఈ సినిమాకు రాజేష్ టచ్ రివర్ దర్శకత్వం వహించారు. సునీతా కృష్ణన్, ప్రదీప్ నారాయణన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇందులో జేడీ చక్రవర్తితోపాటు.. తనిష్ట ఛటర్జీ, శ్రుతి జయన్ కీలకపాత్రలలో కనిపించారు. ఇప్పటికే ఈ సినిమాకు 18 అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి.
అంతర్జాతీయ స్థాయిలో జేడీ చక్రవర్తికి ఈ గుర్తింపు లభించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. జేడీ చక్రవర్తి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. ఈ సినిమానే కాకుండా.. వన్ బై టూ, మనీ మనీ, గులాబీ సినిమాలతో కథానాయికుడిగా అలరించారు. ఆఈ తర్వాత మృగం, దెయ్యం, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా సినిమాలతో విజయాన్ని అందుకున్నాడు.