హాలీవుడ్ సినిమాలను సైతం ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన అవతార్ 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇంగ్లీష్ మూవీని మన దగ్గర గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అదే మార్వెల్ యూనివర్స్ కు చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ.

ఇటీవలే కిసీ కా బాయ్ కిసీ కా జాన్ చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా సల్మాన్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన సినిమాలే కాదు..హాలీవుడ్ సినిమాలను సైతం ప్రమోట్ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఇండియాలో హాలీవుడ్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన అవతార్ 2 సినిమా భారీగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇంగ్లీష్ మూవీని మన దగ్గర గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అదే మార్వెల్ యూనివర్స్ కు చెందిన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ.

ఇప్పటికే గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ ఫస్ట్ వాల్యూమ్ 2014లో.. సెకండ్ వాల్యూమ్ 2017లో రిలీజ్ అయ్యాయి. వీటికి ఇండియాలో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 రాబోతుంది. ఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఇండియాలో ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను సల్మాన్ తీసుకున్నారు. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశాడు భాయ్. తాజాగా ఆ యాడ్ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

అందులో గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ సినిమాలోని గ్రూట్ క్యారెక్టర్ లాగా సల్మాన్ కామెడీ చేస్తున్నట్లు ఈ యాడ్ డిజైన్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ హల్చల్ చేస్తుంది. ఇండియాలోని మార్వెల్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సల్మాన్ యాడ్ తో ఇండియాలో ఈ సినిమాపై భారీ మార్కెట్ మీద కన్నేసింది. మార్వెల్ స్టూడియోస్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూ్ 3 సినిమాను ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్ భాషలలో మే5న రిలీజ్ కాబోతుంది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *