హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అందుకు కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయడమే. మన టాలీవుడ్ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఈ కుర్రాడు హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా..

పైన ఫోటోలో ఉన్న చిన్నారి గాంధీ ఎవరో గుర్తుపట్టారా ?.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ హీరో స్టైలే వేరు. విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ… తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మొదటి సినిమాతోనే హీరోగా క్రేజ్ సంపాదించుకోవడమే కాదు.. నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో నటించిన సినిమాలు అంతగా క్లిక్ కాలేదు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. అందుకు కారణం బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేయడమే. మన టాలీవుడ్ స్టార్ హీరో బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఈ కుర్రాడు హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పుడు గుర్తుపట్టే ఉంటారు కదా.. ఈ కుర్రాడే యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడే బెల్లంకొండ శ్రీనివాస్. 2014లో డైరెక్టర్ వివి వినాయక్ తెరకెక్కించిన అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా అరంగేట్రం చేశాడు శ్రీను. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తర్వాత ప్లాపులు ఖాతాలో వేసుకున్నాడు. జయ జానకి నాయక, సాక్ష్యం చిత్రాలు మెప్పించినప్పటికీ అంతగా క్లిక్ కాలేకపోయాడు.

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఛత్రపతి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఛత్రపతి సినిమాను అదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు శ్రీను. ఇప్పటికే విడుదలైన టీజర్‌ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా మేకర్స్ ఛత్రపతి ట్రైలర్‌ రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు వెర్షన్‌లోని ఎలిమెంట్స్‌కు ఏ మాత్రం తగ్గకుండా నయా టచ్‌తో సాగే స్టైలిష్‌ మాస్‌ యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది ట్రైలర్‌.ఛత్రపతి మే 12న థియేటర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *