నేహ ఒబెరాయ్ అనగానే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ‘బాలు’ సినిమా హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తొస్తుంది. 2005లో దర్శకుడు కరుణాకరన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘బాలు’.

నేహ ఒబెరాయ్ అనగానే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ‘బాలు’ సినిమా హీరోయిన్ అంటే అందరికీ ఠక్కున గుర్తొస్తుంది. 2005లో దర్శకుడు కరుణాకరన్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘బాలు’. ఇందులో నేహ ఒబెరాయ్, శ్రియా శరన్ హీరోయిన్లుగా నటించారు. నేహ ఒబెరాయ్‌కు తెలుగులో ఇదే మొదటి సినిమా. బాలీవుడ్ నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కుమార్తె ఈ అందాల భామ.తొలి చిత్రంతోనే అందం, అభినయం, అమాయకపు నటనతో టాలీవుడ్ ప్రేక్షకులకు తనవైపుకు తిప్పుకుంది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో.. ఆమెకు మరిన్ని ఆఫర్లు రాలేదు. ‘బాలు’ మూవీ తర్వాత జగపతి బాబుతో ‘బ్రహ్మాస్త్రం’ అనే సినిమా చేసింది. అది కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది.

దీంతో ఆమె తెలుగులో కేవలం రెండు సినిమాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాల్లో నటించిన నేహ ఒబెరాయ్.. అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించలేకపోయింది. మొత్తంగా తన సినీ కెరీర్‌లో 6 చిత్రాలు మాత్రమే చేసింది( 4 హిందీ, 2 తెలుగు). ఈమె 2010లో ప్రముఖ డైమండ్ వ్యాపారి విశాల్ షాను పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు ఉన్నాడు. ప్రస్తుతం నేహా ఒబెరాయ్ తనకు ఇష్టమైన రంగాన్ని వదిలిపెట్టకుండా అప్పుడప్పుడూ అడపాదడపా సినిమాలు, టీవీ యాడ్స్ చేస్తోంది. ఇటీవల నేహ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ బ్యూటీ ఇప్పుడెలా ఉందో చూసి తెలుగు ప్రేక్షకులు స్టన్ అయిపోతున్నారు. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నేహ ఒబెరాయ్‌ను చూసి షాక్ అవుతున్నారు.

 

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *