పై ఫొటోలో మాస్క్‌తో కనిపిస్తున్నది ఓ స్టార్‌ హీరో. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రంగప్రవేశం చేశాడు. ఆతర్వాత చిన్న సినిమాల్లో హీరోగా నటించడం మొదలుపెట్టాడు.

పై ఫొటోలో మాస్క్‌తో కనిపిస్తున్నది ఓ స్టార్‌ హీరో. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా రంగప్రవేశం చేశాడు. ఆతర్వాత చిన్న సినిమాల్లో హీరోగా నటించడం మొదలుపెట్టాడు. తన సహజ నటనతో అనతికాలంలోనే స్టార్‌ హీరోల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్‌, కామెడీ, యాక్షన్‌, క్లాస్‌, మాస్‌.. ఇలా ఎలాంటి సినిమాలకైనా సరితూగుతాడీ హీరో. ఇక ఈ హీరోకు అభిమాన గణం కూడా ఎక్కువే. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఈ హ్యాండ్సమ్‌ హీరో అంటే పడి చస్తారు. ఇటీవలే ఓ మంచి మాస్‌ మసాలా మూవీతో మన ముందుకొచ్చిన ఈ హీరో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు కలెక్షన్ల పరంగా వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరాడు. ఈ ఉత్సాహాన్ని కొనసాగించేందుకు తర్వాతి ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం మరింత స్టైలిష్‌ లుక్‌లో రెడీ అవుతున్నాడు. పై లుక్‌ ఇందులో భాగమే. మరి ముసుగేసుకున్న ఈ స్టార్‌ హీరో ఎవరో గుర్తుపట్టారా? అతను మరెవరో కాదు న్యాచురల్ స్టార్‌ నాని.

దసరాతో అదరగొట్టినన నాని తన 30వ సినిమా కోసం స్టైలిష్‌ లుక్‌లోకి మారిపోయాడు. ఈ సినిమాలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆ మధ్య రిలీజ్ చేసిన ప్రీ లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇందులో నాని ఓ ఆరేళ్ల పాపకు తండ్రిగా కనిపించబోతున్నాడు. అలాగే శ్రుతి హాసన్ కూడా ఓ కీ రోల్ పోషిస్తోంది. ప్రస్తుతం నాని 30 మూవీ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. నానితో పాటు పలువురూ అక్కడే ఉంటున్నారు. ఈక్రమంలో నాని ఇప్పుడు తన లుక్ కనిపించకుండా మొహానికి మాస్క్ అడ్డం పెట్టుకుని ఇలా ఫొటోలకు పోజులు ఇచ్చాడు. ప్రస్తుతం ఇవి నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం  క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed