వేర్వేరు కులాలకు సంబంధించిన అమ్మాయి, అబ్బాయిలు ప్రేమలో పడడం, పెద్దల కోసం తమ ప్రేమను త్యాగం చేయడం వంటి యూత్‌ఫుల్‌ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ లవ్‌స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నీతి టేలర్‌ అనే కొత్త అమ్మాయి నటించింది. దిల్‌రూబా అలియాస్‌ దిల్‌ అనే పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది

Mem Vayasuku Vacham Movie

సుమారు దశాబ్ద కాలం క్రితం తనీశ్‌ హీరోగా ‘మేం వయసుకు వచ్చాం’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. రవితేజ ధమాకా వంటి బ్లాక్‌బస్టర్‌ను తెరకెక్కించిన త్రినాథరావు నక్కిన ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వేర్వేరు కులాలకు సంబంధించిన అమ్మాయి, అబ్బాయిలు ప్రేమలో పడడం, పెద్దల కోసం తమ ప్రేమను త్యాగం చేయడం వంటి యూత్‌ఫుల్‌ అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అప్పట్లో ఈ లవ్‌స్టోరీ యువతను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా నీతి టేలర్‌ అనే కొత్త అమ్మాయి నటించింది. దిల్‌రూబా అలియాస్‌ దిల్‌ అనే పాత్రలో ఇట్టే ఒదిగిపోయింది. అందంతో పాటు అభినయంతో కుర్రకారును గిలిగింతలు పెట్టింది. మూవీ కూడా విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత రాహుల్‌ రవీంద్రన్‌తో కలిసి పెళ్లి పుస్తకం అనే చిత్రంలోనూ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీకూడా హిట్‌గా నిలిచింది. ఆతర్వాత లవ్‌డాట్‌కామ్‌ అనే సినిమాలో నటించింది. అయితే దీని తర్వాత హఠాత్తుగా మాయమైంది. మరే తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. కట్‌ చేస్తే సడెన్‌గా బాయ్‌ఫ్రెండ్‌తో నిశ్చితార్థం చేసుకుని అందరికీ షాక్‌ ఇచ్చింది.

సినిమాల్లో బిజీగా ఉండగానే పరీక్షిత్‌ బవా అనే వ్యక్తితో ప్రేమలో పడింది నీతి టేలర్‌. 2019లో అతనిత కలిసి నిశ్చితార్థం చేసుకుంది. ఆ మరుసటి ఏడాదే పరీక్షిత్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైందీ ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్‌ బుల్లితెరపై మాత్రం నటనను కొనసాగిస్తోంది.అక్కడ డ్యాన్స్ రియాలిటీ షోలు, వెబ్ షోలతో బిజీగా గడుపుతోంది. అన్నట్లు సినిమాలకు రాకముందు కూడా బాలీవుడ్‌ బుల్లితెరపై సత్తాచాటింది నీతి. పెళ్లైన తర్వాత మళ్లీ అక్కడకే వెళ్లిపోయింది. బుల్లితెరపై టీవీ షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుందీ ముద్దుగుమ్మ. తన లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను అందులో షేర్‌ చేస్తుంటుంది. వాటిని చూసిన నెటిజన్లు ‘పదేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందంటూ’ నీతి టేలర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

నీతి టేలర్ లేటెస్ట్ ఫొటోస్

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *