ముఖ్యంగా స్త్రీలు మధ్యాహ్న సమయాల్లో పడుకుంటారు. అలాగే సెలవు దినాల్లో  చాలా మంది మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటారు. అయితే మధ్యాహ్న సమయంలో నిద్రపోతే గుండెకు చేటు చేస్తుందని చాలామందికి తెలియదు.

రోజువారీ పనిలో చాలా అలసిపోయిన తర్వాత కాసేపు నడుం వాల్చుదాం అనుకుంటాం. కొంతమంది అయితే ఉదయాన్నే లేచి పనులు చేసుకుని మధ్యాహ్న సమయంలో పడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్త్రీలు మధ్యాహ్న సమయాల్లో పడుకుంటారు. అలాగే సెలవు దినాల్లో  చాలా మంది మధ్యాహ్న సమయంలో నిద్రపోతూ ఉంటారు. అయితే మధ్యాహ్న సమయంలో నిద్రపోతే గుండెకు చేటు చేస్తుందని చాలామందికి తెలియదు. సాధారణంగా మధ్యాహ్న నిద్రలు అధిక శక్తిని ఇస్తాయి. ఒక వ్యక్తి రోజులో మధ్యాహ్న సమయంలో 30 నుంచి 45 నిమిషాల వరకు పడుకుంటే ప్రయోజనం పొందుతారు. ముఖ్యంగా 60 నిమిషాల నుంచి 180 నిమిషాల మధ్య పడుకునే వారిలో గుండె, రక్తపోటు స్థాయిలపై భయంకరమైన ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక వ్యక్తి పగటిపూట నిద్రపోయే సమయాన్ని తగ్గించి, రాత్రి తగినంత మొత్తంలో నిద్రపోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఆరోగ్యకరమైన స్లీపింగ్ రొటీన్ గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మధ్యాహ్న నిద్ర వల్ల సంభవించే దుష్ప్రభావాల గురించి, అలాగే గుండె ఆరోగ్యం ఎలా ప్రభావితమవుతుందో? ఓ సారి తెలుసుకుందాం.

అధిక రక్తపోటు

హైపర్‌టెన్షన్ అని కూడా పిలిచే అధిక-రక్తపోటు నేరుగా పగటిపూట నిద్రపోవడానికి సంబంధించినది. పగటి సమయంలో పడుకోవడం వల్ల అధిక రక్తపోటు స్థాయిలు, స్ట్రోక్ వచ్చే ప్రమాదాలను పెంచుతుంది. ముఖ్యంగా గుండెకు సంబంధించిన పంపింగ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

గుండెపోటు సమస్య

తమ జీవితాల్లో ఎక్కువ భాగం మధ్యాహ్నానికి నిద్రపోయే వ్యక్తులు వారి వృద్ధాప్యంలో స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు రుజువు చేశాయి. కాబట్టి వీలైనంతగా మధ్యాహ్న నిద్రను పరిమితం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండిమధుమేహం

45 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ నిపుణులు చెబుతున్నారు. మధుమేహం గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుందని గమనించాలని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *