ఉబ్బరానికి దోహదపడే అనేక అంశాలు ఉన్నప్పటికీ, అత్యంత సాధారణమైనవి భారీ భోజనం చేయడం, చాలా వేగంగా తినడం, ఉప్పగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఉబ్బరం సమస్య వస్తుంది. అయితే పోషకాహార నిపుణులు కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయట పడడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో ఉబ్బరం అనేది చాలా మంది ప్రజలను వేధిస్తుంది. దాదాపు ప్రతిరోజూ ఎదుర్కొనే ఒక సాధారణ రుగ్మతగా మారుతోంది. ఉబ్బరానికి దోహదపడే అనేక అంశాలు ఉన్నప్పటికీ, అత్యంత సాధారణమైనవి భారీ భోజనం చేయడం, చాలా వేగంగా తినడం, ఉప్పగా ఉండే ఆహారాలు తినడం వల్ల ఉబ్బరం సమస్య వస్తుంది. అయితే పోషకాహార నిపుణులు కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయట పడడానికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఉబ్బరం,నొప్పి నుంచి ఉపశమనం కలిగించే మూలికలు, వంట సామగ్రిని ప్రతిరోజూ ఆహారంలో తీసుకోవాలని పేర్కొంటున్నారు. ముఖ్యంగా కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంలో ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఉబ్బరం సమస్యతో బాధపడేవారు ఆహారంలో చేర్చుకోావల్సిన ఆహార పదార్థాలు ఏంటో? ఓ సారి తెలుసుకుందాం.
ఫెన్నెల్ విత్తనాలు (సాన్ఫ్)
ఈ గింజలు, తరచుగా అనేక భారతీయ వంటకాలలో ఉపయోగిస్తారు. కండరాలను సడలించడంలో యాంటిస్పాస్మోడిక్‌గా పనిచేసే అనెథోల్, ఫెన్‌చోన్, ఎస్ట్రాగోల్‌లను కలిగి ఉంటాయి. ఈ గింజల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇవి పేగు కండరాలను కూడా సంకోచించేలా చేసి ఉబ్బరం సమస్యను దూరం చేస్తాయి.
జీలకర్ర గింజలు
కుమినాల్డిహైడ్, సైమెన్, ఇతర టెర్పెనాయిడ్ సమ్మేళనాలు వంటి జీలకర్రలోని అస్థిర నూనెల సంపద. గ్యాస్ , కడుపు తిమ్మిరి నుంచి తక్షణమే ఉపశమనాన్ని అందించే యాంటీ-బ్లోటింగ్ లక్షణాలతో నిండి ఉంటుంది. కాబట్టి ఉబ్బరం సమస్య ఉన్న వారు జీలకర్ర రసాన్ని తాగితే మేలు కలుగుతుంది.
అజ్వైన్ (క్యారమ్ గింజలు)
పైనేన్, లిమోనెన్, కార్వోన్ వంటి అజ్వైన్ యొక్క అస్థిర సమ్మేళనాలు ఈ గింజల ద్వారా సమృద్ధిగా అందుతాయి. ఉబ్బరం చికిత్సలో వీటిని వాడడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చు.
అల్లం
అల్లం డి-బ్లోటింగ్‌లో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లంలో జింజెరోల్స్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి కడుపును వేగవంతంగా ఖాళీ చేయడంలో సహాయపడతాయి. అలాగే ఉబ్బరం, గ్యాస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి
పుదీనా
పుదీనా కడుపుకు ఓ రిలిఫ్ ఫీలింగ్ అలాగే శక్తిని ఇస్తుంది. ఇది ఔషధ గుణాలతో వస్తుంది. అనాల్జేసిక్, స్పాస్మోలిటిక్, గ్యాస్ట్రోప్రొటెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఉబ్బరం, అజీర్ణం, ఇతర ప్రేగు సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..