ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిన వెంటనే గతంలో ఉన్న నేతల చిత్రాలను తొలగించడం మంచి సంప్రదాయం కాదు. నేనలా చెయ్యలేనని తేల్చి చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షాల పట్ల తమ కుటుంబానికి ఎంతో గౌరవం ఉందని జగదీష్ షెట్టర్ దంపతులు..
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుంచి టికెట్ నిరాకరించడంతో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే అతని కార్యాలయంలోని గోడ మీద ఇప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఫోటోలు అలానే ఉన్నాయి. ఇదే అంశం ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో పెద్ద చర్చకు కారణంగా మారింది. సహజంగా పార్టీ మారితే వెంటనే పాత పార్టీ గుర్తులను ఫోటోలను తొలిగించడం.. కొత్త పార్టీ నాయకులతో దిగిన ఫోటోలను ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అలాంటి పద్దతి తనకు నచ్చదని.. అది తన నా మ్యానరిజం కాదంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత..
జగదీష్ శెట్టర్ 1994 నుంచి హుబ్లీ-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ స్థానానికి బీజేపీ సభ్యునిగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీజేపీకి ఈ ప్రాంతంలో ఉనికి లేని సమయం నుంచి ఇక్కడ పార్టీని కింది స్థాయి వరకు తీసుకెళ్లిన నాయకుడిగా ఆయనకు పేరుంది. ఈ విషయాన్ని ఆయన ప్రతి సభలో చెబుతున్నారు.
బీజేపీతో చిరకాల బంధాన్ని తెంచుకున్న శెట్టర్ ఇప్పుడు కాంగ్రెస్ జెండాను పట్టుకుని పార్టీ కార్యకర్తలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. తన గతాన్ని పక్కనపెట్టి, షెట్టర్ తన హోమ్ ఆఫీస్‌లోని సోఫాలో కూర్చుని తన మద్దతుదారులను, కార్యకర్తలను కలుస్తున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల రెండు ఫోటోలు ఇప్పటికీ ఆయన వెనుక గోడపై వేలాడుతున్నాయి. అదే సోఫాలో కూర్చొని ఓ మీడియా ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రాలపై అడిగిన ప్రశ్నకు ఆయన తనదైన తరహాలో జవాబు చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీపై గౌరవంతో..
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి మారిన వెంటనే గతంలో ఉన్న నేతల చిత్రాలను తొలగించడం మంచి సంప్రదాయం కాదు. నేనలా చెయ్యలేను.’ నరేంద్ర మోదీ, అమిత్ షాల పట్ల తమకు ఎంతో గౌరవం ఉందని జగదీష్ షెట్టర్ దంపతులు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పారు. ఈ ఎన్నికలు నా ఆత్మగౌరవ పోరాటమని, రాజకీయ ఆకాంక్షల కోసం కాదని ఆయన అన్నారు. నా ఆత్మగౌరవం దెబ్బతింది. అందుకే నేను బేషరతుగా కాంగ్రెస్‌లో చేరాను. చివరిసారిగా తనను ఇక్కడ నిలబెట్టి గౌరవప్రదమైన వీడ్కోలు పలికేందుకు బీజేపీ అవకాశం ఇచ్చి ఉండాల్సిందని మాజీ ముఖ్యమంత్రి అన్నారు. “తన సన్నిహితుడికి టిక్కెట్ కోసం పట్టుబట్టి ఈ డ్రామా అంతా సృష్టించిన బీఎల్ సంతోష్, జనరల్ సెక్రటరీ (సంస్థ) కారణంగా ఇది జరగలేదు” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం