ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన బ్లాక్ హ్యూడ్ శాటిన్ డ్రెస్ పై వేలాది స్పటికాలు, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయించిన డ్రెస్ ధరించి మరింత అందంగా మెరిసింది. లోరైన్ స్క్వార్ట్జ్ డైమండ్ నెక్లస్, చోకర్ తో మరింత ఆకర్షిణీయంగా కనిపించింది ఇషా. అయితే ఆమె చేతిలో పట్టుకున్న డాల్ బ్యాగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

న్యూయార్క్ వేదికగా మెట్ గాలా 2023 గ్రాండ్ గా నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఈ ఫ్యాషన్ వేదికపై బాలీవుడ్, హాలీవుడ్ సినీతారలు సందడి చేశారు. ముఖ్యంగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, అలియా భట్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. అలాగే ఈవెంట్లో బడా వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ సైతం పాల్గోన్నారు. ప్రముఖ డిజైనర్ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన బ్లాక్ హ్యూడ్ శాటిన్ డ్రెస్ పై వేలాది స్పటికాలు, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయించిన డ్రెస్ ధరించి మరింత అందంగా మెరిసింది. లోరైన్ స్క్వార్ట్జ్ డైమండ్ నెక్లస్, చోకర్ తో మరింత ఆకర్షిణీయంగా కనిపించింది ఇషా. అయితే ఆమె చేతిలో పట్టుకున్న డాల్ బ్యాగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దీంతో ఆ బ్యాగ్ ధరెంతో సెర్చ్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇషా అంబానీ దుస్తులతో పాటు, ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ ధర సర్వత్రా దృష్టిని ఆకర్షించింది. బ్యాగ్‌ని బొమ్మ ముఖంలా డిజైన్ చేశారు. బ్యాగ్ ధర ఆన్‌లైన్‌లో 30,550 డాలర్లు అంటే దాదాపు రూ.24,97,951. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబ మహిళలు తమ ఖరీదైన నగలు, బట్టల విషయంలో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *