ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 45వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య ఎకానా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన చెన్నై సారథి ధోని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.

Lucknow Super Giants vs Chennai Super Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రస్తుత సీజన్‌లో 45వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) మధ్య ఎకానా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభమైంది. వర్షంతో టాస్‌ కొద్దిగా ఆలస్యమైంది. టాస్ గెలిచిన చెన్నై సారథి ధోని ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో బ్యాటింగ్ చేయనుంది.

ఐపీఎల్ చరిత్రలో మూడోసారి లక్నో, చెన్నైలు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ సీజన్‌లో ఇరు జట్లు రెండోసారి తలపడనున్నాయి. అంతకుముందు ఈ సీజన్‌లో ఆరో మ్యాచ్‌లో ఇరుజట్లు తలపడగా చెన్నై 12 పరుగుల తేడాతో గెలిచింది.

కెప్టెన్ కేఎల్ రాహుల్, ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ గాయాల కారణంగా లక్నో బలహీనపడవచ్చు. సోమవారం ఆర్‌సీబీతో జరిగిన ఈ మ్యాచ్‌లో రాహుల్ గాయపడ్డాడు. అతడి కుడి తొడకు గాయమైంది. ఆదివారం నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తుండగా జారిపడి ఉనద్కత్ గాయపడ్డాడు.

ఇవి కూడా చదవండిఇరుజట్లు:

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, మనన్ వోహ్రా, కరణ్ శర్మ, ఆయుష్ బడోని, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్(కీపర్), కృనాల్ పాండ్యా(కెప్టెన్), కృష్ణప్ప గౌతమ్, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్.

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీ(కెప్టెన్/కీపర్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed