అప్పటివరకు తన కామెడీతో అందరినీ నవ్వించిన మహేశ్‌.. ఈ సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాడు. ఈ సినిమాలో మహేశ్‌ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాతే రంగస్థలం మహేశ్‌గా మారిపోయాడు.

జబర్దస్త్‌ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో మహేశ్‌ అచంట ఒకరు. తనదైన యాస, డైలాగ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడాయన. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టాడు. మెగా పవర్‌ స్టార్ రామ్‌చరణ్ రంగస్థలం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటివరకు తన కామెడీతో అందరినీ నవ్వించిన మహేశ్‌.. ఈ సినిమాలో ఎమోషనల్‌ సీన్స్‌లో అద్భుతంగా నటించాడు. ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాడు. ఈ సినిమాలో మహేశ్‌ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాతే రంగస్థలం మహేశ్‌గా మారిపోయాడు. దీని తర్వాత బ్లఫ్‌ మాస్టర్‌, మహానటి, శ్రీనివాస కల్యాణం,118, బుర్రకథ, నిన్ను తలచి, వరుడు కావలెను, డర్టీహరి, దాస్ కా ధమ్కీ తదితర సినిమాల్లో నటించాడు. కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న మహేశ్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. అందులో తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఒడిదొడుకుల గురించి షేర్‌ చేసుకున్నాడు. తనకు వచ్చిన ఈ పేరు ఒక్కరోజులో వచ్చింది కాదంటూ ఎమోషనల్‌ అయ్యాడు.

‘నేను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు జీరో. కేవలం నా ప్రతిభను నమ్ముకొని వచ్చా. నాకు చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎప్పటికైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. సినిమాలనే నమ్ముకున్నా. అయితే నేను సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడే నాన్న చనిపోయారు. ఆ సమయంలో నాన్న చితి కట్టెలకు కూడా డబ్బులిచ్చే స్తోమత లేదు. అప్పుడు నా జేబులో రూ.500 కూడా లేవు. అప్పుడు చాలా బాధేసింది. ఎందుకు బతికున్నానురా అనిపించింది. దీంతో చాలామంది బంధువులు, స్నేహితులు నీకు సినిమాలు అవసరమా? అంటూ తిట్టేశారు. ఆ సమయంలో నేను మాత్రం చాలా బాధపడ్డాను. నాకు మొదట అవకాశం ఇచ్చింది డైరెక్టర్ సుకుమార్. రంగస్థలంలో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చారు. హైదరాబాద్‌లో ఇల్లు లేదని.. సొంతూళ్లో ఇటీవలే ఇంటిని కట్టుకున్నా. ‘ అంటూ మహేశ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు మహేశ్‌.

ఇవి కూడా చదవండిమరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed