మహేశ్ బొమ్మకు జస్ట్ యావరేట్ టాక్ వచ్చిందంటేనే ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో చెప్పాల్సిన పనిలేదు. అలాంటిది.. బొమ్మ బ్లాక్ బాస్టర్ అయిందో ఇక కలెక్షన్ల ఊచకోత ఉంటుంది. దేశవ్యాప్తంగా మహేశ్‌కు మిలియన్ల మంది అభిమానులు ఉన్నారన్న విషయం తెలిసిందే.

వయసు పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న అందం.. తనయుడు పక్కన నిల్చుంటే బ్రదరా అని అడిగేలా చేసే చార్మ్.. ఒక్క పాన్ ఇండియా మూవీ కూడా చేయకుండానే దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్.. ఇప్పటికే మీకు అర్థమయ్యి ఉంటుంది. మేము మాట్లాడేది టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గురించి అని. తన రెండు దశాబ్దాల కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్స్ ఇచ్చిన మహేశ్.. ఇప్పటికీ సేమ్ జోష్‌తో మునిగిపోతున్నారు. అయితే సినిమా చేస్తారు లేదంటే ఫ్యామిలీతో వెకేషన్‌ కూడా వెళ్తారు. ఒక్క రూమర్ కూడా ఆయన చుట్టూ ఉండదు. ప్యామిలీ పర్సన్. ఇక బిజినెస్‌లో పెట్టుబడులు, ప్రకటనల్లో నటించడం ద్వారా ఓ రేంజ్‌లో ఇనకమ్ సంపాదిస్తున్నారు మహేశ్.

కాగా ఇప్పుడు ఆయన తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు టాలీవుడ్ టాక్.  త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రజంట్ ఓ సినిమా చేస్తున్నాడు మహేశ్ ఈ ప్రాజెక్ట్ కోసం అతని పారితోషికం ఇప్పటికే ఆకాశాన్ని తాకింది.  ఎలాంటి ప్యాన్-ఇండియా అప్పీల్ లేకుండా, మహేష్ బాబు ఈ చిత్రంలో తన పాత్ర కోసం 70 కోట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఆగడాగండి.. త్రివిక్రమ్ తర్వాత.. జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో SSMB29 మూవీ చేయనున్నాడు.  దీనికోసం ఏకంగా 110 కోట్లు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్ నుంచి 100 కోట్ల క్లబ్‌లో చేరిన యాక్టర్ ప్రభాస్ అని చెబుతున్నారు. సినిమాకు జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు.. మహేశ్ సినిమా ఈజీగా వంద కోట్లు వసూలు చేస్తుంది. ఇక సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే.. చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళితో సినిమా తర్వాత మహేశ్ ఏ స్థాయికి వెళ్తాడు అనేది ఊహించడం కూడా కష్టంగా ఉంది. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం  క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *