మనోబాల మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినిమా తారలు ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తల్చుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మనోబాల మృతిపై
నటుడిగా, డైరెక్టర్‌గా తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మనోబాల (69) బుధవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఇవాళ ఉదయం చెన్నై ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మనోబాల మరణంతో కోలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పలువురు సినిమా తారలు ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని తల్చుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ క్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ మనోబాల మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. ‘ఫేమస్ డైరెక్టర్, యాక్టర్, నా స్నేహితుడు మనోబాల మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. ఇది నన్ను ఎంతగానో కలిచివేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. మనోబాల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని ట్వీట్ చేశారు రజనీకాంత్.
రజనీకాంత్ నటించిన పలు సినిమాల్లో మనోబాల కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించారు. అందులో చంద్రముఖి, లింగా, కథానాయకుడు వంటి హిట్ సినిమాలున్నాయి. రజనీతో పాటు మంచు మనోజ్, శివకార్తికేయన్, గౌతమ్ కార్తీక్ తదితర స్టార్ హీరోలు, వారి అభిమానులు సోషల్ మీడియా వేదికగా మనోబాల మృతికి నివాళులు అర్పించారు. 1970ల్లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనోబాల మొదట 1979లో దిగ్గజ దర్శకుడు భారతీ రాజా దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆతర్వాత డైరెక్టర్‌గా మారి 20కు పైగా సినిమాలను తెరకెక్కించారు. కొన్ని చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. దాదాపు 350 సినిమాల్లో సహాయ నటుడిగా మెప్పించారు. కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య లాంటి స్టార్ హీరోల సినిమాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. మనోబాలకు భార్య ఉష మహదేవన్, కుమారుడు హరీశ్ ఉన్నారు.
Sad to hear the sudden passing away of the Multi faceted actor #Manobala sir 💔
May his soul rest in peace, Om Shanti 🙏🏼
Strength to family members & friends.#RIPManobala pic.twitter.com/urnd1hE5iZ— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) May 3, 2023
A young #Manobala from his Director days in the 80’s.. #RIPManobala pic.twitter.com/SaBOCWs7qw
— Ramesh Bala (@rameshlaus) May 3, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..